మాది ప్రజాప్రభుత్వం…ప్రజారంజక పాలన అందిస్తాం డిప్యూటీ సీఎం భట్టి !
ఆరు గ్యారంటీల అమలు చేస్తాం …ఇప్పటికే రెండు అమలు చేశాం ..
ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన
కొత్తగూడెంలో పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించారు …
పొత్తులో భాగంగా సిపిఐ అభ్యర్థి సాంబశివరావు ను గెలిపించాం ..
మాది ప్రజాప్రభుత్వం ..ప్రజారంజక పాలన అందిస్తామని డిప్యూటీ సీఎం ఆర్థిక ,విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు …ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రిపదవులు పొంది మొదటిసారిగా భద్రాద్రి కొత్తగూడం జిల్లా పాల్వంచ లో జరిగిన మంత్రుల సత్కారకార్యక్రమం సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్నారు .. ఈసందర్భంగా డిప్యూటీ సీఎం ,మంత్రులకు జననీరాజనం పలికారు ..ఆత్మీయ సత్కారాలతో ప్రేమను చాటుకున్నారు ..కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండల కేంద్రంలోని సుగుణా గార్డెన్స్ లో శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. …పట్టు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించి మంత్రులకు అభినందనలు తెలిపారు….ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రసంగించారు..
ఎన్ని ఆర్థిక సవాళ్లు వచ్చినా అధిగమించి ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు …తమ ప్రభుత్వం ఇచ్చిన మాటను తప్పదు. ఎప్పుడు వెనక్కి తీసుకోలేదన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందని, ఇంటింటికి వెళ్లి ప్రజలకు చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు… ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేసిందన్నారు …మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే గ్యారంటీని నెరవేర్చామన్నారు ….ఆరోగ్య తెలంగాణగా ఉండాలని ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచుతూ రెండో గారంటీని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు ..మిగతా నాలుగు గ్యారెంటీలు కూడా 100 రోజుల లోపు అమలు చేస్తామన్నారు … తెలంగాణ ప్రజలు తమకు ఓట్లు వేసి ప్రజల ప్రభుత్వం తెచ్చుకున్నారని చెప్పారు…దశాబ్ద కాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన గత ప్రభుత్వం ప్రజల సంపదను చేసిందని ధ్వజమెత్తారు …ప్రజల సంపదను గత ప్రభుత్వ పెద్దలు లూటీ చేయడంతో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విసిగి వేసారి పోయిన ప్రజలు మార్పును కోరుకున్నారని చెప్పారు…ప్రజలు మార్పు కోరుకోవడం వల్లే ఖమ్మం జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో తాము గెలిచామని చెప్పారు.
ప్రజలు కోరుకున్న మార్పుకు అనుగుణంగా ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ముగ్గురు మంత్రులం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు …భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తమ ప్రభుత్వ హాయాం లోనే బహుళార్థ సాధక ప్రాజెక్టులు, పరిశ్రమలు వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి జరిగిందన్నారు….గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంత అభివృద్ధి తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని చెప్పారు….
కొత్తగూడెం నియోజకవర్గం గురించి మాట్లాడుతూ ఇది తమకు కంచుకోటని చెప్పారు….ఎన్నికల పొత్తులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గం మిత్రపక్ష అభ్యర్థిని నిలబెట్టడం జరిగిందని అన్నారు …గత ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే పార్టీకి ద్రోహం చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరడం వల్ల గెలిపించిన ప్రజలు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారన్నారు …పార్టీకి ద్రోహం చేసి వేరే పార్టీలోకి వెళ్లినందున ఓడించాలని కసితో పనిచేసి కూనంనేని సాంబశివరావు గెలిపించిన ప్రజలలకు అభినందనలన్నారు …సాంబశివరావు చాలా మృదు స్వభావి, రాజకీయాలు చేయకుండా ప్రజాసేవ చేయాలని నిత్యం ఆలోచన చేసే ఎమ్మెల్యేని గెలిపించుకోవడం మీ అదృష్టమన్నారు ….
ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని ప్రజలను పీడించాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి సాంబశివరావు కాదన్నారు … కొత్తగూడెంలో కూనమనేని సాంబశివరావును గెలిపించుకోవడం వల్ల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పారు. ఈ అభినందన కార్యక్రమంలో ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగమయి, అశ్వరావుపేట శాసనసభ్యులు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు….