- హుజూర్ నగర్‌లో మంత్రి ఉత్తమ్‌తో కలిసి పర్యటించిన పొంగులేటి
- కలెక్టర్లతో సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి తీపికబురు చెబుతారని వెల్లడి
- కాంగ్రెస్ హయాంలో ప్రతి గ్రామానికి 100కు పైగా ఇళ్లు వచ్చాయన్న పొంగులేటి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపికబురు చెప్పనున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన హుజూర్ నగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ… కలెక్టర్లతో సమీక్ష అనంతరం సీఎం రేవంత్ తీపికబురు చెబుతారన్నారు. హుజూర్ నగర్‌లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 150 ఇళ్లను మాత్రమే కట్టించిందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ హయాంలో ప్రతి గ్రామానికి 100కు పైగా ఇళ్లు వచ్చాయన్నారు.
హుజూర్ నగర్‌లో 2,160 ఇళ్లు పూర్తి చేసి, రాబోయే మూడు నాలుగు నెలల్లో అర్హులైన పేదలకు అందిస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్యాక్రాంతమైన భూములపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హామీల విషయంలో మాటలకే పరిమితమైందన్నారు.