Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

చైనా కరోనా వ్యాక్సిన్ ‘సినోవాక్’ కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి…

-చైనా కరోనా వ్యాక్సిన్ ‘సినోవాక్’ కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి
-చైనాలో ఇప్పటికే వినియోగంలో సినోవాక్
-సినోవాక్ ను అభివృద్ధి చేసిన సినోవాక్ బయోటెక్
-18 ఏళ్లకు పైబడిన వారికి ఇవ్వొచ్చన్న కమిటీ
-కొవాక్స్ లోనూ సినోవాక్ కు చోటు లభించే అవకాశం
కరోనా కట్టడి కోసం చైనా తయారుచేసిన సినోవాక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమతి మంజూరు చేసింది. 18 ఏళ్లకు పైబడిన వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వొచ్చని, తొలి డోసు అనంతరం 2 నుంచి 4 వారాలకు రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణుల కమిటీ పేర్కొంది.

చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. చైనాలో దీన్ని ఉపయోగిస్తున్నారు. తాజాగా, డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇతర దేశాల్లోనూ సినోవాక్ వినియోగానికి మార్గం సుగమం అయింది. ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూహెచ్ఓ అమలు చేస్తున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యాచరణ కొవాక్స్ లోనూ సినోవాక్ కు స్థానం దక్కనుంది. కరోనా వ్యాక్సిన్ల ఎగుమతులపై భారత్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో, పలు పేద దేశాల్లో వ్యాక్సిన్ కొరతను సినోవాక్ తీర్చనుందని భావిస్తున్నారు.

Related posts

రెండు డోసులు ఒకేసారి ఇచ్చేశారంటున్న మహిళ…

Drukpadam

కరోనా స్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చురకలు…

Drukpadam

మహమ్మారి సమయంలో దేశంలో లెక్కలోకి రాని మరణాలు 49 లక్షలు!

Drukpadam

Leave a Comment