Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌ల బదిలీ… ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సబర్వాల్

  • ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతికుమారి
  • గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కా నియామకం
  • వెయిటింగ్ లిస్టింగ్‌లో ఉన్న పలువురికి పోస్టింగ్‌లు
26 IAS transfers in Telangana state

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కాను నియమించింది. ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా అహ్మద్ నదీమ్, సాగునీటి శాఖ క్యాదర్శిగా రాహుల్ బొజ్జాలను బదిలీ చేసింది. ఇటీవలి వరకు సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను ఫైనాన్స్‌ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న దివ్య, భారతి హోలికేరి, చిట్టెం లక్ష్మి తదితరులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. పలువురు కలెక్టర్లను బదిలీ చేసింది.. మరికొందరికి కలెక్టర్లుగా బాధ్యతలు అప్పగించింది.

రాష్ట్రంలో మరోసారి భారీ స్థాయిలో ఐఏఎస్‌(IAS) అధికారుల బదిలీలు జరిగాయి. ఏకంగా 26 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్‌ బొజ్జాను సాగు నీటి శాఖ కార్యదర్శిగా నియామకం చేస్తూ సీఎస్‌ శాంతి కుమారి ఉత్తర్వులు ఇచ్చారు. పురావస్తు శాఖ డైరెక్టర్‌గా భారతి హొళికేరి, ఫైనాన్స్‌ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా సభర్వాల్, బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్‌ ఎక్కా బదిలీపై వెళ్లారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా కె.శశాంకను నియమించారు.

26మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీల వివరాలు..

సాగునీటిశాఖ కార్యదర్శి – రాహుల్‌ బొజ్జా నియామకం

ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్య కార్యదర్శి – స్మితా సభర్వాల్‌

పురావస్తు శాఖ డైరెక్టర్‌ – భారతి హొళికేరి

బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి – బుర్రా వెంకటేశం

గనులశాఖ ముఖ్యకార్యదర్శి – మహేశ్‌ దత్‌ ఎక్కా

ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి – అహ్మద్‌ నజీద్జీ

ఏడీ కార్యదర్శి – ఎం.రఘునందన్‌రావు

ఆయుష్‌ డైరెక్టర్‌ – ఎం.ప్రశాంతి

రంగారెడ్డి కలెక్టర్‌ – కె.శశాంక

నల్గొండ కలెక్టర్‌ – హరిచందన

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ – బి.ఎం.సంతోష్‌

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్‌ – అద్వైత్‌ కుమార్ సింగ్‌

సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ – వల్లూరు క్రాంతి

పాడిపరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్‌ – చిట్టెం లక్ష్మి

పంచాయతీ రాజ్‌, ఆర్‌డీ కార్యదర్శి – సందీప్‌ సుల్తానియా

ఫైనాన్స్‌, ఫ్లానింగ్‌ ప్రత్యేక కార్యదర్శి – కృష్ణభాస్కర్‌పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్‌ – చిట్టెం లక్ష్మి

కార్మిక శాఖ కార్యదర్శి – కృష్ణ ఆదిత్య

పీసీబీ సభ్య కార్యదర్శి – బుద్ధ ప్రకాశ్‌

మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శి – ఎ.ఎం. ఖానమ్‌

టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ – ఆర్‌.వి. కర్ణన్‌

సీఎంవో జాయింట్ సెక్రటరీ – సంగీత సత్యనారాయణ

Related posts

ఉచిత బస్సు సర్వీస్ పై భిన్నాభిప్రాయాలు …ప్రభుత్వం పునరాలోచన చేస్తుందా …?

Ram Narayana

మాజీమంత్రి తుమ్మలకు కీలక పదవి ఇచ్చే అవకాశం ..?

Drukpadam

 డబుల్ బెడ్రూం ఇళ్ల అంశంలో అత్యంత కఠినంగా వ్యవహరించండి: కలెక్టర్లకు కేటీఆర్ దిశానిర్దేశం

Ram Narayana

Leave a Comment