Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఖమ్మం సీపీగా సునీల్ దత్

ఖమ్మం పోలీస్ కమిషనర్ గా విష్ణు ఎస్ వరియర్ స్థానంలో సునీల్ దత్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది….2014 బ్యాచ్ కి చెందిన సునీల్ దత్ గతంలో కొత్తగూడెం ఎస్పీ గా పనిచేశారు …ఖమ్మం మీద ఆయనకు కొంత అవగాహన ఉంది … కోటిరెడ్డి , రావూరి రఘునందన్ రావు లు వస్తారని ప్రచారం జరిగింది…పలువురు పేర్లు పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు సునీల్ దత్ వైపు మొగ్గుచూపింది ….ఇప్పటికే విష్ణు ఎస్ వరియర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ కి వెళ్లారు ….ఇది అత్యంత కీలకమైన పోస్ట్ ….ఇందులో పనిచేసేందుకు అందరు ఆసక్తి చూపరు…పైరవీలు పనికి రావు …అలాంటిది విష్ణు ఎస్ వరియర్ కు రావడం విశేషమే ….

తెలంగాణ ప్రభుత్వం 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వీవీ శ్రీనివాసరావును నియమించింది. పోలీసు నియామక బోర్డు చైర్మన్‌గా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించింది. కో-ఆర్డినేషన్ డీఐజీగా గజరావు భూపాల్, మహిళా భద్రతా విభాగం డీఐజీగా రెమా రాజేశ్వరి, రాజేంద్ర నగర్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3గా ఆర్ వెంకటేశ్వర్లు, రామగుండం సీపీగా ఎల్ ఎస్ చౌహాన్, ఎల్బీ నగర్ డీసీపీగా సీహెచ్ ప్రవీణ్ కుమార్, టీఎస్ ట్రాన్సుకో ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, మాదాపూర్ డీసీపీగా జీ వినీత్‌లకు బాధ్యతలు అప్పగించారు.

Related posts

బీజేపీలో ఈటెలపై గుస్సా …!

Drukpadam

 బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్

Ram Narayana

ఆ డబ్బుతో కేసీఆర్ విదేశాలకు పారిపోతారు.. భూములు కొన్నవారు జాగ్రత్త: రేవంత్ హెచ్చరిక

Ram Narayana

Leave a Comment