Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

టిఆర్ఎస్ భవన్ కు రెవిన్యూ శాఖ నోటీసులు…

హైదరాబాదులోని బిఆర్ఎస్ హెడ్ క్వార్టర్స్… గతంలో టిఆర్ఎస్ భవనంగా ఉన్న టిఆర్ఎస్ కార్యాలయం 2011లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలం ఇవ్వగా నిర్మాణం పూర్తి చేసుకున్నారు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే వివిధ పార్టీ కార్యాలయాలకు తక్కువ ధరకు పార్టీల కార్యాలయాలకు వివిధ జిల్లాల్లో స్థలాలు అప్పగించారు. దీంతో ఆయా పార్టీలు కొత్త భవనాలు.. కట్టుకున్నాయి… టిఆర్ఎస్ కూడా ఉద్యమ కాలంలో ఈ బిల్డింగును నిర్మించింది… రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలకు ఆశ్రమం ఇచ్చే విధంగా ఉండాలని కెసిఆర్ భావించి పెద్ద భవనాన్ని నిర్మించారు… అయితే ఇందులో బిఆర్ఎస్ కు చెందిన టీ న్యూస్ ఛానల్ కూడా నడిపిస్తున్నారు… అది నిబంధన విరుద్ధమంటూ కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చింది . 2011 తర్వాత దానిపై ఉమేష్ రావు అనే కాంగ్రెస్ నాయకుడు కోర్టుకెళ్లారు చాలా కాలం కోర్టులో దీనిపై వాదోపవాదములు జరిగాయి . కారణాలు ఏమైనా అది వాయిదా పడుతూ వచ్చింది. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నందున కోర్టులో కూడా తన మాట చల్లకపోవడంతో ఉమేష్ రావు వెనక్కు తగ్గారు .. తిరిగి గత రెండు మూడు సంవత్సరాలుగా రాములు నాయక్ అనే మాజీ ఎమ్మెల్సీ బిఆర్ఎస్ కార్యాలయంలో టీ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్నందున కోర్టును ఆశ్రయించారు… కోర్టులో కేసు ఉండగా ని రాష్ట్రంలో ప్రభుత్వంమారింది… కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. దీంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బిఆర్ఎస్ భవనంలో పార్టీ కార్యకలాపాలే నిర్వహించాల్సిండగా న్యూస్ ఛానల్ ను నడపటం ఏమిటని ప్రశ్నిస్తూ కార్యాలయం ఇన్చార్జి నోటీసులు జారీ చేసింది… రెవెన్యూ శాఖ జారీ చేసిన ఈ నోటీసులు కార్యాలయం ఇన్చార్జ్ అందుకున్నారు… అందులోని ఎప్పటిలోగా కార్యాలయం నుంచి టీ న్యూస్ ఛానల్ బయటకు పంపుతారో చెప్పాలని లేదా దీని అనుమతులు రద్దు చేయడం జరుగుతుందని పేర్కొన్నట్టు తెలుస్తుంది … అయితే బిఆర్ఎస్ పెద్దలు టీ న్యూస్ కార్యాలయాన్ని బిఆర్ఎస్ భవనం నుంచి తరలించి వేరే ప్రైవేట్ భవనంలోకి మార్చుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు… దీనివల్ల బిఆర్ఎస్ భవనం నుంచి టీ న్యూస్ ఛానల్ వెళ్ళిపోతే ఇక పంచాయతీ ఉండకపోవచ్చునని తెలుస్తుంది…

అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది.. అదేమిటంటే న్యూస్ ఛానల్ బిజినెస్ ఛానల్ అవుతుందా….? లేదా…? అనేది తేలాల్సి ఉంది… ఏదైనా వ్యక్తి ఒక న్యూస్ ఛానల్ పెట్టుకుంటే అది వార్తలను ప్రసారం చేస్తే బిజినెస్ ఛానల్ గా పరిగణించబడుతుందా లేదా అనేది ఇక్కడ చర్చని అంశంగా మారింది… కొన్ని లోపాలు ఉన్నప్పటికీ వాస్తవంగా న్యూస్ ఛానల్స్ గాని పత్రికలు గాని ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండి సమాజ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి… నాటి స్వాతంత్ర పోరాటం నుంచి నేటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు అంతకుముందు జరిగిన సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటం లో కూడా పత్రికలు ప్రధానంగా మీడియా వహించిన పాత్ర చాలా గొప్పది … దాన్ని ఎవరూ కాదనలేని సత్యం… అయితే టీ న్యూస్ ఛానల్ ఒక పార్టీకే అనుకూలంగా ఉండవచ్చు.. కానీ అందులో వచ్చే వార్తలు సమాజానికి పనికొస్తున్నాయా లేదా అని చూడాల్సి ఉంది… చూద్దాం ఏం జరుగుతుందో…..!

Related posts

కుమార్తె అరెస్ట్ అయి నేటికి నెల రోజులు.. ఇప్పటి వరకు పరామర్శించని కేసీఆర్..

Ram Narayana

వరంగల్ ప్రీతి ఆత్మహత్య కేసు: నిందితుడు సైఫ్ ర్యాగింగ్ చేయడం నిజమే.. తేల్చిచెప్పిన కమిటీ

Ram Narayana

తెలంగాణలో మరో రెండు నెలల్లో సర్పంచ్ ఎన్నికలు

Ram Narayana

Leave a Comment