Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

టీడీపీకి కేశినేని శ్వేత గుడ్ బై …

బరువెక్కిన హృదయంతో చెబుతున్నా… టీడీపీతో నా ప్రస్థానం ముగిసింది: కేశినేని శ్వేత

  • విజయవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు
  • ఇప్పటికే టీడీపీకి దూరం జరిగిన కేశినేని నాని
  • తండ్రి బాటలోనే కుమార్తె… కార్పొరేటర్ పదవికి రాజీనామా
  • కేశినేని భవన్ ద్వారా ప్రజాసేవను కొనసాగిస్తానని వెల్లడి

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి….ఒక పక్క వైసీపీ నుంచి నేతలు టీడీపీ జనసేనలో చేరుతుండగా మరో పక్క టీడీపీ కీలక నేత విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి దూరం జరిగారు …దాదాపు టీడీపీ తో ఆయన ప్రస్థానం ముగిసినట్లే …తండ్రి దారిలోనే కూతురు టీడీపీకి గుడ్ బై చెప్పారు …కేశినేని కూతురు శ్వేత విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ గా కొనసాగుతున్నారు ….తన తండ్రిని టీడీపీ లో అవమానించడం బాధించిందని అందువల్ల ఆపార్టీ ఉండలేనని ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు …కార్పొరేటర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేయడం ఒక్క బెజవాడ రాజకీయాల్లోనే కాకా మొత్తం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది ….

విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి దూరం కాగా, కుమార్తె కేశినేని శ్వేత కూడా తండ్రి బాటలోనే నడిచారు. విజయవాడలో కార్పొరేటర్ పదవికి ఆమె రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగభరితంగా స్పందించారు.

“బరువెక్కిన హృదయంతో చెబుతున్నా… టీడీపీతో నా ప్రస్థానం ముగిసింది. ఇప్పటివరకు నాకు మార్గదర్శనం చేసిన చంద్రబాబు సర్ కు, నారా లోకేశ్ అన్నకు కృతజ్ఞతలు. విజయవాడ ప్రజల ప్రేమాభిమానాలకు, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. కేశినేని భవన్ ద్వారా ప్రజాసేవను కొనసాగిస్తాను” అంటూ శ్వేత ట్వీట్ చేశారు.

Related posts

జనవరి నుంచి జనంలోకి జగన్.. క్షేత్ర స్థాయి పర్యటనలకు ప్లాన్

Ram Narayana

 మా సీఎం అభ్యర్థి చిరంజీవి: చింతా మోహన్

Ram Narayana

యార్లగడ్డ వెంకట్రావుకు చంద్రబాబు అపాయింట్ మెంట్!

Ram Narayana

Leave a Comment