Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

వాహ్ అనిపించేలా దక్షణ కొరియా దిగ్గజ ఎల్జీ కంపెనీ వినూత్న టీవీ ఆవిష్కరణ

అసలు ఉందా లేదా అనిపిస్తున్న సూపర్ టీవీ!

  • అమెరికాలో సీఈఎస్ టెక్ షో
  • తన అత్యాధునిక టీవీని ప్రదర్శించిన ఎల్జీ సంస్థ
  • వైర్ లెస్ ట్రాన్స్ పరెంట్ ఓఎల్ఈడీ టీవీగా పిలుస్తున్న ఎల్జీ
  • టెక్ షోలో ఎల్జీ టీవీని చూసి నోరెళ్లబెట్టిన సందర్శకులు 
LG reveals Wireless Transparent OLED Television

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ‘ఎల్జీ’ (LG) నెక్ట్స్ జనరేషన్ టీవీలను ఆవిష్కరించింది. ఎంతో పారదర్శకమైన తెరలతో కూడిన ఈ టీవీలు ఔరా అనిపిస్తున్నాయి. అమెరికాలో జరుగుతున్న సీఈఎస్ టెక్ షోలో ఎల్జీ ఈ సూపర్ టెక్నాలజీ టీవీలను ప్రదర్శించింది. అసలు ఇలాంటి టీవీలు సాధ్యమేనా అని అందరూ అనుకునేలా ఈ సరికొత్త టీవీలు చూపరులకు విభ్రాంతి కలిగిస్తున్నాయి. 

ఓ గాజు ముక్కలా… ఒకవైపు నుంచి చూస్తే మరోవైపు కనిపించేలా ఉన్న ఈ ఎల్జీ టీవీ టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించడం ఖాయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని వైర్ లెస్ ట్రాన్స్ పరెంట్ ఓఎల్ఈడీ టీవీగా పిలుస్తున్నారు. గాజుపై ఆర్గానిక్ మెటీరియల్ ను ముద్రించి ఈ టీవీ తెరను డిజైన్ చేశారు. 

సీఈఎస్ టెక్ షోకి వచ్చిన వారు ఎల్జీ టీవీని చూడకుండా వెళ్లడంలేదంటే అతిశయోక్తి కాదు. టెక్ షో సందర్భంగా ఈ టీవీలో ప్రదర్శించిన కంటెట్ ను చూసి సందర్శకులు నోరెళ్లబెట్టారు. అందులోని దృశ్యాలు కళ్లముందే జరిగినట్టు ఉండడంతో టెక్ నిపుణులు సైతం వావ్ అనకుండా ఉండలేకపోయారు. 

ఈ వైర్ లెస్ ట్రాన్స్ పరెంట్ ఓఎల్ఈడీ టీవీ ఎంత పారదర్శకంగా ఉందంటే… టీవీ ఆఫ్ చేస్తే అందులోని విడిభాగాలు సైతం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Related posts

భారీగా పెరిగిన బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు…

Ram Narayana

భారత్ వేదికగా తొలిసారి యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ సెషన్

Ram Narayana

సూర్యుడి ఉపరితలంపై భారీ విస్పోటనాలు.. ఎగసిపడ్డ సౌర జ్వాలలు…

Ram Narayana

Leave a Comment