మంత్రి పొంగులేటి నివాసానికి దీపాదాస్ మున్షీ…
తాజా రాజకీయాలు ..పార్లమెంట్ ఎన్నికలపై చర్చ
పార్టీని రాష్ట్రంలో పటిష్ట పరచాలన్న మున్షి
మెజార్టీ ఎంపీ సీట్లు గెలిచేలా పనిచేయాలన్న మున్షి
తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి బుధవారం ఉదయం వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి ఆహ్వానం మేరకు మున్షీ వారి నివాసానికి వెళ్లారు. ఇంటికి వచ్చిన దీపాదాస్ మున్షీని అతిథి మర్యాదలతో పొంగులేటి సత్కరించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య రాబోవు పార్లమెంట్ ఎన్నికలు తదితర రాజకీయ అంశాలపై ప్రస్తావన జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో తాజా రాజకీయాలు వివిధ పార్టీల పరిస్థితి , కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలు గురించి కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది …పార్టీని రాష్ట్రంలో మరింతగా పటిష్ఠపరచాలని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలవాలని ఆమె అన్నారు ..పార్టీ నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లోలాగానే టీం వర్క్ చేయాలనీ అభిప్రాయపడినట్లు తెలుస్తుంది…ఇప్పటికే రాష్ట్రంలో మంత్రులకు వివిధ నియోజకవర్గాల భాద్యతలు అప్పగించారు ..ఖమ్మం , మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గాలకు భాద్యులుగా మంత్రి పొంగులేటి ఉన్నారు …