Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షర్మిల పార్టీ పేరు వైయస్సార్ తెలంగాణ పార్టీ ( Y S R T P )

షర్మిల పార్టీ పేరు వైయస్సార్ తెలంగాణ పార్టీ
-రిజిస్టర్ చేసిన షర్మిల ముఖ్య అనుచరుడు వాడుక రాజగోపాల్
-ఫౌండర్ చైర్మన్ గా వాడక రాజగోపాల్ పేరు
-పొడి అక్షరాలలో వై యస్ ఆర్ టి పి  గా ఉండనుంది
-పేరును షర్మిల అధికారికంగా ప్రకటించనున్నారు
-ఈ పేరుపై ఎవరికైనా అభ్యతంతరాలు ఉంటె తెలపాలన్న ఎన్నకల సంఘం

తెలంగాణతో ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వైయస్ షర్మిల రాజకీయపార్టీ ఏర్పాటు లాంఛనాలన్నీ పూర్తీ చేసుకుంటుంది. వై యస్ కుటుంబానికి ముఖ్య అనుచరుడు , వై యస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని వాడుక రాజగోపాల్ పార్టీ పేరు రిజిస్టర్ పేరు ఏర్పాట్లలో బిజీ గా ఉన్నారు. ఆయనే దానికి ఫౌండర్ చైర్మన్ గా పార్టీ రిజిస్టర్ చేశారు. ఆయన స్వయంగా పార్టీ రిజిస్టర్ వ్యవహారాన్ని ఢిల్లీ లో చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని ఫార్మాలిటీస్ పూర్తీ చేశారు. ఇక అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం నోటీసు బోర్డులో ఉంచింది. మరో రెండు మూడు రాజోలులో మిగతా ఫార్మాలిటీస్ పూర్తీ అయినా తరువాత అధికారికంగా ఎన్నకల సంఘం వైయస్సార్ తెలంగాణ పార్టీ పేరుతొ రిజిస్టర్ పత్రాన్ని అందించనున్నట్లు తెలుస్తుంది. అయితే ముందుగా వైయస్ ఆర్ పుట్టిన రోజున పార్టీ పేరు ప్రకటించాలనే యోచనలో ఉన్న షర్మిల ముందుగా ప్రకటిస్తారా ?లేక అదే రోజున ప్రకటిస్తారా ? అనేది వెల్లడించలేదు . పొడి అక్షరాలలో వై యస్ ఆర్ టి పి   ( Y S R T P )గా పార్టీ ఉంటుంది ఇంకా జెండా ఎజెండా ఖరారు కావాల్సి ఉంది .

Related posts

సిటీ బ‌స్సులో ఫుట్‌బోర్డు ప్ర‌యాణం చేసిన ఎమ్మెల్యే!

Drukpadam

ఎన్నికలప్పుడే పొత్తులు ,ఎత్తులు :సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని..!

Drukpadam

మాకు 350 సీట్ల పక్కా.. యూ పీ సీఎం యోగి ఆదిత్యనాథ్!

Drukpadam

Leave a Comment