- టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న మహేందర్ రెడ్డి
- పది నెలల పాటు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా కొనసాగనున్న మహేందర్ రెడ్డి
- టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా ఐదుగురి నియామకం
మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. అనంతరం టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొని… జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన ఈ పదవిలో పది నెలల పాటు కొనసాగుతారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‍గా మహేందర్ రెడ్డితో పాటు ఐదుగురు సభ్యులను కూడా నియమించారు. రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేంద్ర, రిటైర్డ్ పోస్టల్ డిపార్టుమెంట్ ఆఫీసర్ అమిరుల్లా ఖాన్, జేఎన్టీయూ ప్రొఫెసర్ నర్రి యాదయ్య, జేన్కో ఈడీ రామ్మోహన్ రావు, రిజైన్డ్ గ్రూప్ 2 ఆఫీసర్ పాల్వాయి రజనీకుమారిలను సభ్యులుగా నియమించారు. ప్రభుత్వ ప్రతిపాదనలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు.