Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

టికెట్ దక్కని వైసీపీ నేతలు ఇతర పార్టీల్లోకి క్యూ …

ఏపీ అధికార పక్షం వైసీపీని వీడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇవాళ గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరగా, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్ లో చేరారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో ఎలీజా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎలీజాకు కాంగ్రెస్ కండువా కప్పిన షర్మిల ఆయను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

వైసీపీ టికెట్ రాని వారిలో ఎలీజా కూడా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో చింతలపూడి నుంచి వైసీపీ అభ్యర్థిగా కంభం విజయరాజుకు అధిష్ఠానం టికెట్ కేటాయించింది. దాంతో ఎలీజా హైకమాండ్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి చెందారు.

ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ, సొంత పార్టీ నేతలు తన పట్ల కుట్రపూరితంగా వ్యవహరించారని, తనకు సమాచారం ఇవ్వకుండానే ప్రాంతీయ సమన్వయకర్తలు సమావేశాలు పెట్టేవారని ఆరోపించారు. దీనిపై సీఎం జగన్ కు నివేదించినా, ఆయన పట్టించుకోలేదని వాపోయారు. కాంగ్రెస్ లౌకికవాద పార్టీ కావడం వల్లే ఆ పార్టీలో చేరానని ఎలీజా వెల్లడించారు. తనకు చింతలపూడి టికెట్ పై షర్మిల భరోసా ఇచ్చారని చెప్పారు.

తిరుపతి జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్… బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ల సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ పెద్దలు వరప్రసాద్ కు కాషాయ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు.

ఈసారి ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది. కొందరిని ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసింది. టికెట్ దక్కని వారిలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా ఉన్నారు. గూడూరు వైసీపీ అభ్యర్థిగా ఎం.మురళీధర్ కు అవకాశం ఇచ్చారు.

ఈ నేపథ్యంలో, బీజేపీలో చేరిన వరప్రసాద్ తిరుపతి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. తిరుపతి నియోజకవర్గం ఆయనకు కొత్త కాదు. వరప్రసాద్ 2014లో తిరుపతి ఎంపీగా గెలిచారు. 2019లో గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Related posts

45 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. ఇంత దారుణం చూడలేదు: చంద్రబాబు

Ram Narayana

జనసేనకు మరో షాక్.. కైకలూరు పార్టీ సమన్వయకర్త రాజీనామా..!

Ram Narayana

పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ తప్పుల తడక..పోతిన మహేష్ ధ్వజం ..

Ram Narayana

Leave a Comment