వ్రతం చెడ్డా ఫలితం దక్కని జలగం వెంకట్రావు …!
బీజేపీలో చేరి ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ జలగం వెంకట్రావు
ఖమ్మం టికెట్ తాండ్ర వినోద్ రావు కు కేటాయించిన బీజేపీ
జలగం బీజేపీలో ఉంటారా …
ఉమ్మడి రాష్ట్ర మాజీముఖ్యమంత్రిగా పనిచేసి పరిపాలన దక్షుడిగా పేరుతెచ్చుకున్న దివంగత జలగం వెంగళరావు తనయుడు మాజీఎమ్మెల్యే జలగం వెంకట్రావు కు వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదు …ఖమ్మం నుంచి బీజేపీ టికెట్ పై పోటీచేసి తన సత్తా చాటాలని భావించిన జలగం వెంకట్రావుకు టికెట్ దక్కక భంగపడ్డారు …ఆయనకు బీజేపీ మొండిచేయి చూపించి ,ఆశలపై నీళ్లు చల్లింది … ఆయనకు కచ్చితంగా ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తారనే నమ్మకంతో ఇటీవలనే బీజేపీలో చేరారు …బీజేపీ పెద్దలు ఖమ్మం టికెట్ ఆయనకే ఇస్తామని హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది…. ఆయన కూడా తనకే టికెట్ వస్తుందని ప్రకటించుకున్నారు …కానీ ఆయన్ను కాదని మరొకరికి అదికూడా జిల్లాలో అంతగా పేరులేని వ్యక్తికి టికెట్ కేటాయించడం చర్చనీయాంశంగా మారింది …ఒక సందర్భంలో బీఆర్ యస్ ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరావు బీజేపీలో చేరి ఖమ్మం నుంచి పోటీచేస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి..దానిపై ఆయన మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నానని తెలివిగా తప్పుకున్నారు … ఆయనపై వస్తున్న వార్తలను ఖండించకపోవడం గమనార్హం …అయితే బీజేపీ ప్రకటించిన జాబితాలో ఖమ్మం సీటు తాండ్ర వినోదరావు పేరు చేరింది .. ఆయన గత కొంత కాలంగా ఖమ్మంలో తానే బీజేపీ అభ్యర్థినని పెద్ద ఎత్తున పోస్టర్లు కూడా గోడలపై అంటించారు … కొత్తగూడెం ,పాల్వంచ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆయనపేరుతో ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది….
జలగం బీజేపీలోనే ఉంటారా …?
తనకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తారన్న నమ్మకంతో బీజేపీలో చేరిన జలగం బీజేపీలోనే కొనసాగుతారా …? లేదా అనేది ప్రశ్నర్ధకంగా మారింది …ఒక రకంగా చెప్పాలంటే ఆయన స్ట్రైట్ ఫార్వార్డ్ గా ఉండే మనస్తత్వం వల్ల బీజేపీ రాజకీయాలకు వంట పట్టించుకుంటాడా లేదా అనే అభిప్రాయాలూ కూడా ఉన్నాయి… 2004 మొదటిసారిగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అడుగుపెట్టిన వెంకట్రావు సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ టికెట్ పై గెలుపొందారు ….సత్తుపల్లి ఎస్సీ రిజర్వడ్ గా మారడంతో 2009 లో ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ ఆశించినా రాలేదు…దీంతో ఇండిపెండెంట్ గా పోటీచేసి తుమ్మల నాగేశ్వరరావు పై స్వల్ప తేడాతో ఓడిపోయారు …2014 లో కొత్తగూడెం నుంచి టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు …తిరిగి 2018 టీఆర్ యస్ టికెట్ పై పోటీచేసి ఓడిపోయారు … 2024 లో బీఆర్ యస్ టికెట్ ఇవ్వలేదు స్వతంత్రంగా పోటీచేసి రెండవస్థానంలో నిలిచారు …అధికార బీఆర్ యస్ పార్టీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరావు మూడవస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది … ఆయనకు బీజేపీ ఖమ్మం సీటు ఇస్తే పార్టీకి మంచి ఊపు వస్తుందని అనుకున్నారు … ఆయనకు టికెట్ ఇవ్వకపోగా నిరాశపరిచారు…దీంతో ఇప్పడు ఆయన బీజేపీలో ఉంటారా …? లేదా అనేది ఆసక్తిగా మారింది … వెయిట్ అండ్ సి జలగం ఏమిచేస్తారో చూడాలి మరి …!