Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటల బాటలో కొండా విశ్వేశ్వర రెడ్డి …బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధం…

ఈటల బాటలో కొండా విశ్వేశ్వర రెడ్డి …బీజేపీ లో చేరేందుకు రంగం సిద్ధం
-డి కె అరుణతో మంతనాలు
-మరికొందరు కూడా అదే బాటలో
-బీజేపీ వ్యూహాలలో డి కె అరుణ మాస్టర్ మైండ్
మరో 4 లేదు ఐదు రోజుల్లో మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీ లో చేరనున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డాతో సమావేశం జరిపి బీజేపీలో చేరేందుకు తన సమ్మతిని తెలియజేశారు. బీజేపీ గూటికి చేరాలా వద్ద అనే మీమాంస లో ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా ఈటల బాటలో పయనించేందుకు సిద్దమైనట్లు సమాచారం. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన విశ్వేశ్వర రెడ్డి అనేక సందర్బాలలో బీజేపీ ని పొగిడారు. కానీ ఎందుకో బీజేపీ పై అపనమ్మకం … బీజేపీ ,కేసీఆర్ ఒకేటే అనే అభిప్రాయం తో ఉన్నారు. కానీ ఈటల జె పి నడ్డాను కలిసిన తరువాత కొంత క్లారిటీ వచ్చింది. బీజేపీ తెలంగాణ లో టీఆర్ యస్ కు ప్రత్యాన్మయంగా ఉండబోతోందనే విశ్వాసంతో టీఆర్ యస్ వ్యతిరేకులు లేదా కేసీఆర్ భాదితులు ,ఉద్యమకారులు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారు. అందులో భాగంగానే అనేక మంది ఈటలతో పాటు బీజేపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి ,తుల ఉమా , రమేష్ రాథోడ్ మరికొంత మంది బీజేపీ లో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతుంది. కమలనాథుల కార్యాలయం కేసీఆర్ శిభిరం నుంచి వస్తున్నా అసమ్మతి వాదుల కోసం ముస్తాబావుతుంది. ఈటల తో పాటు బీజేపీ లో చేరేవారు ఢిల్లీ వెళతారా ? లేక ఇక్కడే హైదరాబాద్ లో చేరతారా ? అనేది ఇంకా నిర్ణయం కాలేదు . బహుశా ఈ రోజు లేదా రేపు ఫైనల్ అవుతుందని అంటున్నారు.

Related posts

న్యాయ ,శాసన వ్యవస్థల పరిధిపై ఏపీ శాశనసభలో సుదీర్ఘ చర్చ…

Drukpadam

విలేకరులపై నోరు పారేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే కాపు …

Drukpadam

కాంగ్రెస్ ఓటర్లు జాబితాకు పట్టు …నో చెప్పిన అధిష్టానం …

Drukpadam

Leave a Comment