Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
హైద్రాబాద్ వార్తలు

హైదరాబాద్ వాసులకు మెట్రో రైల్ శుభవార్త…

  • మార్చి 31తో ముగిసిన రాయితీలను పొడగింపు
  • పలు ఆఫర్ల గడువును 6 నెలలపాటు పెంచుతూ ప్రకటన
  • ఉగాది వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన హైదరాబాద్ మెట్రో

ఉగాది పండుగ వేళ నగరవాసులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. మార్చి 31తో ముగిసిన పలు రాయితీలను తిరిగి పొడగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి సోమవారం కీలక ప్రకటన చేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్‌పాస్‌, సూపర్‌ పీక్‌ అవర్‌ ఆఫర్లను 6 నెలల పాటు పెంచుతున్నామన్నారు. ఈ నిర్ణయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నామని ఎన్‌వీఎస్ రెడ్డి అన్నారు.

కాగా ఇప్పటివరకు అందించిన రాయితీలకు మంగళం పాడుతున్నట్టుగా రెండు రోజుల క్రితమే మెట్రో రైల్ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఉదయం, రాత్రి వేళల్లో అందించే 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక రూ.59కే ప్రయాణ సౌలభ్యం కల్పించే సూపర్‌ సేవర్‌ మెట్రో హాలిడే కార్డు, రద్దీ లేని సమయాల్లో ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం తగ్గింపు అందించే సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌, మెట్రో స్టూడెంట్‌ పాస్‌లపై రాయితీలన్నీ మార్చి 31 తోనే ముగిశాయి. దీంతో రాయితీలు పొడగించకపోవడంపై మెట్రో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Related posts

హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్లో… చికెన్ బిర్యానీలో ట్యాబ్లెట్లు!

Ram Narayana

రూ.175 కోట్లు కాజేశారు… హైదరాబాద్ లో భారీ సైబర్ చౌర్యం!

Ram Narayana

బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర 30 లక్షల ఒక వెయ్యి…

Ram Narayana

Leave a Comment