Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జగన్ పార్టీకే గుర్తింపు …అసలైన వైయస్సార్ పార్టీ అదే….

జగన్ పార్టీకే గుర్తింపు …అసలైన వైయస్సార్ పార్టీ అదే
-‘అన్న వైఎస్సార్ పార్టీ’ పిటిషన్ ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు
-వైఎస్సార్ పదం తమకే చెల్లుతుందన్న అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
-పిటిషన్ లో మెరిట్ లేదన్న ఢిల్లీ హైకోర్టు
-ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా తీసుకున్నామని వ్యాఖ్య
-వైఎస్సార్సీపీకి ఉన్న గుర్తింపు కొనసాగుతుందని తీర్పు
జగన్ పార్టీకే గుర్తింపు …అసలైన వైయస్సార్ పార్టీ అదే అని స్పష్టమైంది . వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమదే అనే తమదే అసలైన వైయస్సార్ అని జగన్ పార్టీకు వైయస్సార్ పార్టీగా పిలుచుకునే హక్కులేదని కొందరు ఎన్నకల సంఘానికి ఫిర్యాదు చేయటంతో పాటు కోర్టుకు వెళ్లారు. ఢిల్లీ హైకోర్టు లో పిటిషన్ వేశారు. దీనిపై స్పందించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా జగన్ పార్టీకే హక్కు ఉందని ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకున్నామని తెలిపింది. అంతేకాకుండా పిటిషన్ వేశాను వ్యక్తికి పిటిషన్ వేసే అర్హతపై కూడా ప్రశ్నించింది. ……ఆయన వాదన సమంజసంగా లేదని కొట్టివేసింది. ….
వైఎస్సార్సీపీకి ఉన్న గుర్తింపు ఇకపై కూడా కొనసాగుతుందని ఢిల్లీ హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరించింది. వైఎస్సార్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. వైఎస్సార్ అనే పదం తమకే చెందుతుందంటూ ‘అన్న వైఎస్సార్ పార్టీ’ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

తప్పుడు ఉద్దేశాలతో కేసు వేశారని, పిటిషన్ కు ఎలాంటి మెరిట్ లేదని పేర్కొంటూ, అన్న వైఎస్సార్ పార్టీ వేసిన పిటిషన్ ను ఈ సందర్భంగా కోర్టు కొట్టి వేసింది. వైఎస్సార్సీపీ గుర్తింపు ఇకపై కూడా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ప్రతీక్ జైన్ సింగిల్ జడ్జి బెంచ్ తీర్పును వెలువరించింది.

వైఎస్సార్సీపీ అనేది అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమని ఆ పార్టీ తన పిటిషన్ లో పేర్కొంది. తమ పార్టీ పేరు వైసీపీ వాడుకుంటోందని వాదించింది. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ… ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కూడా తాము తీసుకున్నామని… పిటిషనర్ వాదనలో మెరిట్ లేదని వెల్లడించింది.

Related posts

ఖమ్మంలో బంద్ ను పర్వేవేక్షించిన కమీషనర్ ఆఫ్ పోలీసు

Drukpadam

బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టివేసిన కోర్టు!

Drukpadam

ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. ఏయే ఉద్యోగాలు ఎన్నెన్ని ఉన్నాయంటే..!

Ram Narayana

Leave a Comment