Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

నేటి నుంచి నీట్​ పీజీ 2024 రిజిస్ట్రేషన్​.. ఎలా అప్లై చేసుకోవాలంటే..!

  • జూన్ 23న పరీక్ష.. జులై 15న ఫలితాలు
  • ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 15 మధ్య కౌన్సెలింగ్
  • సెప్టెంబర్ 16 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం

నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ – పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్- పీజీ) 2024 రిజిస్ట్రేషన్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) చేపట్టనుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్బీఈ) అధికారిక వెబ్ సైట్ natboard.edu.in లింక్ ను ఓపెన్ చేయాలి.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా..
స్టెప్ 1:natboard.edu.in వెబ్ సైట్ ను తెరవాలి.
స్టెప్ 2: వెబ్ సైట్ హోం పేజీలో నీట్ పీజీ 2024 లింక్ పై క్లిక్ చేయాలి
స్టెప్ 3: రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను పూర్తి చేసి అకౌంట్ లోకి లాగిన్ కావాలి.
స్టెప్ 4: ఆ తర్వాత దరఖాస్తు నింపాలి.
స్టెప్ 5: అనంతరం పేమెంట్ పూర్తి చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
స్టెప్ 6: కన్ఫర్మేషన్ పేజీని డౌన్ లోడ్ చేసుకొని ఒక ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవాలి.

ఎవరికి ఎంత పరీక్ష ఫీజు
నీట్ పీజీ 2024 జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు రూ. 3500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 2500. పరీక్ష రుసుమును క్రెడిట్ కార్డ్ లేదా దేశీయ బ్యాంకులు జారీ చేసిన డెబిట్ కార్డు లేదా వెబ్ పేజీలో అందుబాటులో ఉన్న ఇతర చెల్లింపు పద్ధతులను ఉపయోగించవచ్చు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్బీఈఎంఎస్ అధికారిక వెబ్ సైట్ ను చూడాలి.

ఫలితాలు ఎప్పుడు?
నీట్ పీజీ అడ్మిట్ కార్డు 2024 జూన్ 18న అందుబాటులోకి వస్తుంది. పరీక్షను జూన్ 23న నిర్వహిస్తారు. జూలై 15న ఫలితాలు విడుదల అవుతాయి. గతంలో ఈ పరీక్షను జూలై 7న నిర్వహించాలనుకున్నారు. నీట్ పీజీ 2024కు అర్హత సాధించేందుకు అభ్యర్థులు ఆగస్టు 15 కటాఫ్ తేదీలోగా ఇంటర్న్ షిప్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 5 నుంచి అక్టోబర్ 15 మధ్య కౌన్సెలింగ్ సెషన్లు జరుగుతాయి. సెప్టెంబర్ 16 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది.

ప్రశ్నలు ఇలా..
నీట్ పీజీ పరీక్ష 200 మార్కుల మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. పరీక్ష పేపర్ ను కేవలం ఇంగ్లిష్ లోనే ఇస్తారు. అభ్యర్థులు మూడున్నర గంటల్లో పరీక్షను పూర్తి చేయాలి. తప్పు సమాధానాలకు 25 శాతం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. జవాబు రాయని ప్రశ్నలకు మార్కుల్లో కోత ఉండదు.

Related posts

ఇప్పటి వరకు 6.50 కోట్లకు పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు

Ram Narayana

పెరుగుతున్న రాహుల్ గ్రాఫ్ …తగ్గని మోడీ ఆదరణ ….

Drukpadam

క్యూఎస్ ర్యాంకుల్లో సత్తా చాటిన భారత విద్యాసంస్థలు…

Ram Narayana

Leave a Comment