Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

ఆన్‌లైన్ ద్వారా కూడా నామినేషన్ దాఖలు చేయవచ్చు…

24లోగా ప్రింట్ అందించాలి: వికాస్‌రాజ్

  • నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను జాగ్రత్తగా నింపాలన్న ఈసీ
  • ఒక్కో అభ్యర్థి మూడు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చునని వెల్లడి
  • నామినేషన్ వేసేటప్పుడు ఐదు ఫొటోలు ఇవ్వవలసి ఉంటుందని వెల్లడి

ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నవారు ఆన్‌లైన్ ద్వారా కూడా నామినేషన్ దాఖలు చేయవచ్చునని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను జాగ్రత్తగా నింపాలన్నారు. ఒక్కో అభ్యర్థి మూడు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చునని తెలిపారు. నామినేషన్ వేసేటప్పుడు ఐదు ఫొటోలు ఇవ్వవలసి ఉంటుందన్నారు. ఆన్ లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేసిన వారు ఈ నెల 24వ తేదీలోగా ప్రింట్ తీసుకొని అందించాలని స్పష్టం చేశారు.

నాలుగో విడత ఎన్నికలకు తొలిరోజు నామినేషన్ ప్రక్రియ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానానికి ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మెదక్ నుంచి రఘునందన్ రావు నామినేషన్లు దాఖలు చేశారు. వీరు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు. నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, మెదక్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

Related posts

శాసనమండలి ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల

Ram Narayana

ఆంధ్రప్రదేశ్‌లో కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు…

Ram Narayana

ముగిసిన లోక్ సభ ఐదో విడత పోలింగ్…

Ram Narayana

Leave a Comment