Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఎన్టీఆర్ కు భారత రత్నఇవ్వాలనే ఉద్యమానికి మంత్రి పొంగులేటి మద్దతు…

ఎన్టీఆర్ కు భారత రత్నఇవ్వాలనే ఉద్యమానికి మంత్రి పొంగులేటి మద్దతు
-ఎన్టీఆర్ పరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని కొనియాడిన మంత్రి

టీడీపీ కార్యాలయానికి వెళ్లి పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్య మంత్రి సీనియర్ ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాల్సిందే అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డి తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రత్న ఇవ్వాలని చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు తెలిపి ఆయన, రఘు రాం రెడ్డి కలిసి కార్డులపై సంతకాలు చేసి..పోస్టు చేశారు. అనంతరం పార్టీ నేతలు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కేత్తినేని హరీష్ లతో కలిసి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లో అనేక సంస్కరణలు తెచ్చారని అన్నారు.ఆ ఫలితంగానే.. కొత్త వారు రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు అని ప్రశంసించారు. ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు గా అనేకమందికి ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, విద్యా, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణ కుమారి, నాయకులు ఎండీ.ముస్తఫా, కొప్పుల చంద్రశేఖర్ రావు, బాణోతు ఉత్తేజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజా ప్రభుత్వంలో పైరవీలకు తావులేదు…పొంగులేటి

Ram Narayana

ఖమ్మంలో ఘనంగా ఎన్టీఆర్ వర్దంతి …వివిడిగా..కలివిడిగా కాంగ్రెస్ టీడీపీలు..

Ram Narayana

ఎన్నికల నిబంధనలను పాతర …ప్రలోభాలకు స్వేచ్చ…సిపిఎం ఘాటు విమర్శ

Ram Narayana

Leave a Comment