Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆదిత్యనాథ్‌ పుట్టినరోజుకు మోదీ ట్విటర్‌లో శుభాకాంక్షలు చెప్పక పోవడంపై చర్చ…

ఆదిత్యనాథ్‌ పుట్టినరోజుకు మోదీ ట్విటర్‌లో శుభాకాంక్షలు చెప్పక పోవడంపై చర్చ…
-ఎందుకు తెలియజేయలే దంటే అని పీఎంఓ వివరణ
-ట్విటర్‌లోను విస్తృత చర్చ
-పార్టీలో విభేదాలు చెలరేగాయంటూ వదంతులు
-యూపీ ప్రభుత్వంలో మార్పులు తథ్యమంటూ ఊహాగానాలు
-ప్రధాని కార్యాలయ వివరణతో వదంతులకు తెర
-కరోనా నేపథ్యంలోనే ప్రధాని శుభాకాంక్షలు తెలియజేయడం లేదన్న పీఎంఓ
-కేరళ,రాజస్థాన్‌,హరియాణా,గోవా సీఎంలకూ తెలియజేయలేదని వెల్లడి

యూ పీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేయలేదు .సహజంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు , కేంద్రమంత్రులకు ఇతర ప్రముఖలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయటం ఆనవాయితీగా ఉంది . అందువల్ల యూ పీ సీఎం యోగికి జన్మదిన శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా చెప్పలేదు . దీనిపై పెద్ద ఎత్తున దుమారమే రేగింది. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ కి గడ్డుపరిస్థితులు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ బాగా దెబ్బ తిన్నది . యోగి పాలనపై ప్రజల్లో పెల్లుబుకుతున్న నేపథ్యంలో ప్రధాని ఆయనపై కోపంగా ఉన్నారని రాష్ట్రంలో నాయకత్వ మార్పు తధ్యమని ప్రచారం జోరుగా జరుగుతుంది. దీనిపై వెంటనే ప్రధాని మంత్రి కార్యాలయం జోక్యం చేసుకున్నది . అలాంటి ఏమి లేదని కరోనా నేపథ్యంలో ప్రధాని ఎవరికీ ట్విట్టర్ ద్వారా చెప్పటమేలేదని వివరణ ఇచ్చింది . అయితే యోగికి ప్రధాని స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన విషయాన్నీ గుర్తు చేసింది ……….
ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వంపై ఆ పార్టీ అధినాయకత్వం ఆందోళనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ రాష్ట్రానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బహిరంగంగానే విమర్శలు చేస్తుండడం గమనార్హం. వీటికి తోడు నేడు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలపకపోవడంతో పార్టీలో లుకలుకలు పెద్ద ఎత్తునే ఉన్నట్లు ట్విటర్‌లో నెటిజెన్లు గుసగుసలాడుకుంటున్నారు. సాధారణంగా మోదీ ప్రముఖుల జన్మదినం రోజు తప్పనిసరిగా ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతుంటారు.

అయితే, మోదీ ట్విటర్‌ వేదికగా ఆదిత్యనాథ్‌కు శుభాకాంక్షలు తెలపకపోవడానికి విభేదాలు కారణం కాదని ప్రధాని కార్యాలయం స్పష్టతనిచ్చింది. శనివారం ఆదిత్యనాథ్‌తో నేరుగా మాట్లాడి ప్రధాని శుభాకాంక్షలు తెలియజేసినట్లు వెల్లడించింది. కరోనా రెండో దశ విజృంభణ తీవ్ర రూపం దాల్చినప్పటి నుంచి మోదీ ఎవరికీ ట్విటర్‌ వేదికగా, బహిరంగంగా శుభాకాంక్షలు తెలపడం లేదని వివరణ ఇచ్చింది. ఇటీవల జన్మదినం జరుపుకున్న కేరళ, రాజస్థాన్‌, హరియాణా, గోవా ముఖ్యమంత్రులకు సైతం మోదీ శుభాకాంక్షలు తెలియజేయలేదని వెల్లడించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ మధ్య ఆరెస్సెస్‌ సహా ప్రధాని, పార్టీ జాతీయ నాయకులు, యూపీలో కీలక నేతలు కలిసి ఓ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించే విషయంపై విస్తృతంగా చర్చించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ, ప్రభుత్వంలో మార్పులు తప్పవంటూ వదంతులు ఊపందుకున్నాయి. వీటికి తోడు ఈరోజు ఆదిత్యనాథ్‌కు మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయకపోయే సరికి పార్టీలో మార్పులు తథ్యమని అంతా చర్చించుకున్నారు. కానీ, వాటన్నింటినీ ప్రధానమంత్రి కార్యాలయ వివరణ కొట్టిపారేసింది.

Related posts

ఏపీ స్పీకర్ తమ్మినేనిపై రాష్ట్రపతికి కూన రవికుమార్ ఫిర్యాదు…!

Drukpadam

ప్రశాంత్ కిశోర్ ఎత్తుగడలు తెలంగాణలో పనిచేయవు: ఈటల

Drukpadam

జమిలి ఎన్నికలు చట్ట సవరణ లేకుండా సాధ్యమా ?

Drukpadam

Leave a Comment