Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న ఈటల మాటలు…

తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్న ఈటల మాటలు…
-తన పేరు ప్రస్తావించడంపై హరీష్ రావు భగ్గుభగ్గు
– కవితను తామే కార్మిక సంఘానికి అధ్యక్షురాలుగా ఉండమని కోరమన్న థామస్ రెడ్డి
-ఈటల మాటలు సమర్థనీయం కాదు ….సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
-ఈటల బీజేపీలో చేరడం టీఆర్ యస్ కు నష్టం
-తెలంగాణను బెంగాల్ లా చేయవచ్చు ….సిపిఐ నారాయణ

ఈటల పార్టీకి రాజీనామా వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తుంది . ఆయన పోతూపోతూ పార్టీలో ప్రజాస్వామ్యం పై హరీష్ రావు ,కవితాలపై ,మరికొంత మంది నాయకుల పేర్లు ప్రస్తావించారు. తాను వామపక్ష వాదినని అంటూ కమ్యూనిస్ట్ లపై కూడా మాట్లాడటం బీజేపీ లో చేరేందుకు చేస్తున్న వాదనలపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వీరుడు శూరుడు అన్న వాళ్ళ ఆయన రాజకీయ నిర్ణయంపై తెగడటం ప్రారంభించారు. ప్రత్యేకించి మంత్రి హరీష్ రావు తన పేరు మాటిమాటికి ప్రస్తావించడాన్ని తీవ్రంగా ఖండించారు. తనపై తుఫాకి పెట్టాలను కోవడం విఫలయత్నమేనని అన్నారు. ఇప్పటివరకు ఈటల కు పార్టీ మంచి గుర్తింపుని ఇచ్చిందని పేర్కొన్నారు. తనకు కేసీఆర్ ఎక్కడ తక్కువ చేయలేదని ఆయనే నాకు గురువు, మార్గదర్శి , తండ్రితో సమానమని అన్నారు . తన ప్రాణమునంత వరకు పార్టీకి విధేయుడిగానే ఉంటానని స్పష్టం చేశారు. ఇక ఆర్టీసీ కార్మిక సంఘకు కవితను తామే అధ్యక్షురాలుగా ఉండమని కోరామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకులు థామస్ రెడ్డి స్పష్టం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈటల చర్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. తాను కమ్యూనిస్ట్ నంటూనే మతోన్మాద,ఫాసిస్టు బీజేపీ లో చేరడంపై సిగ్గుపడాలన్నారు .
సిపిఐ నారాయణ మాత్రం మరోలా స్పందించారు. ఈటల బీజేపీ లో చేరడం టీఆర్ యస్ కు ఇబ్బందేనని పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణను బెంగాల్ లా మార్చేందుకు ప్రయత్నిస్తుందని హెచ్చరించారు.

హరీష్ రావు ….ఖండన

పార్టీలో తనకు కూడా అనేక అవమానాలు జరిగాయంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీశ్‌ రావు తీవ్రంగా ఖండించారు. పార్టీని వీడడానికి ఈటలకు అనేక కారణాలు ఉండొచ్చని.. ఇలా తనపై తుపాకి పెట్టాలనుకోవడం విఫలయత్నమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఈటల పార్టీ వీడడం వల్ల తెరాసకు ఎలాంటి నష్టం లేదన్నారు. పార్టీకి ఆయన చేసిన దానికంటే.. ఆయనకు పార్టీ ఇచ్చిందే ఎక్కువన్నారు. ఆయన గొడవలకు నైతిక బలం సమకూర్చుకునేందుకే తన పేరును ప్రస్తావిస్తున్నారని హరీశ్‌ తెలిపారు.

పార్టీలో తాను ఒక నిబద్ధత, విధేయత కలిగిన కార్యకర్తనని హరీశ్‌ తెలిపారు. పార్టీ ప్రయోజనాలకే తాను తొలి ప్రాధాన్యమిస్తానని పేర్కొన్నారు. పార్టీ అధినాయకత్వం ఏ పని అప్పగించినా దాన్ని పూర్తి చేయడమే తన బాధ్యత అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదని.. తనకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానులన్నారు. ప్రాణం ఉన్నంత వరకు పార్టీలో ఇలాగే నడుచుకుంటానని తెలిపారు. ఈటల రాజేందర్‌ వైఖరి తాచెడ్డ కోతి.. వనమెల్ల చెరిచిందన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.

ఈటల వ్యాఖ్యలపై టీఎంయూ ఫైర్..

తెలంగాణలోని సంఘాలను సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేయాలని యత్నిస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని యూనియన్లన్నీ కల్వకుంట్ల కవిత చేతిలో ఉన్నాయని ఆయన అన్నారు. తాను, హరీశ్ రావు ఏర్పాటు చేసిన ఆర్టీసీ యూనియన్ కూడా కవిత చేతిలో ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై టీఎంయూ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి ఫైర్ అయ్యారు.

కవితపై ఈటల ఇష్టం వచ్చినట్టు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని థామస్ చెప్పారు. టీఎంయూ అధ్యక్షురాలిగా ఉండాలని కవితను తామే కోరామని… తమ పార్టీ అధిష్ఠానం ఒప్పుకుంటే మీ ప్రతిపాదనకు అంగీకరిస్తామని ఆమె చెప్పారని తెలిపారు. కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకున్నది కేసీఆరే అని చెప్పారు. ఆర్టీసీపై ప్రేమతో బడ్జెట్లో కేసీఆర్ రూ. 3 వేల కోట్లను కేటాయించారని తెలిపారు. సొంత ప్రయోజనాల కోసమే ఆర్టీసీపై, కవితపై ఈటల మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల చేసిందేమీ లేదని విమర్శించారు.

Related posts

ఏపీసీసీ అధ్యక్షుడి రేసులో ముగ్గురు నేతలు!

Drukpadam

బీజేపీ టార్గెట్ గా హైదరాబాద్ లో హోర్డింగ్స్

Drukpadam

బీజేపీ వాళ్లకు ఏ జడ్జీ శిక్ష వేయరు: ప్రియాంక గాంధీ!

Drukpadam

Leave a Comment