Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయంఆఫ్ బీట్ వార్తలు

కిక్కిరిసి.. కుక్కేసినట్టు.. అక్కడ అంత మంది జనమా?

  • చిన్న దేశాలే అయినా అత్యధిక జన సాంద్రత ఉన్న ప్రాంతాలివే..
  • మన దేశ జన సాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్ కు 481 మంది
  • అదే చిన్న దేశాల్లో వేలల్లోనే జన సాంద్రత

మన దేశ జనాభా 140 కోట్లను దాటేసింది. చైనాను వెనక్కితోసి ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా నిలిచింది. వామ్మో ఇంత జనాభానా అనిపిస్తుంటుంది. కానీ మనం చాలా నయం.. ఎందుకంటే దేశం చాలా పెద్దది. విస్తారమైన వనరులు ఉన్నాయి. సగటున చూస్తే..  ఇండియాలో ప్రతి చదరపు కిలోమీటర్ కు జనాభా 481 మంది మాత్రమే. కానీ కొన్ని దేశాలు కిక్కిరిసిపోయి ఉంటాయి తెలుసా?

చదరపు కిలోమీటర్ కు వేల మంది..
కొన్ని దేశాల జనాభా  చాలా తక్కువే అయినా.. అవి చాలా చిన్నగా ఉండటం వల్ల వాటి జన సాంద్రత ఎక్కువగా ఉంటుంది. అంటే కిక్కిరిసిపోయి జీవిస్తున్నట్టే. అలాంటి దేశాలు చాలా వరకు ఇతర దేశాలపై ఆధారపడి ఉంటుంటాయి. మరి ప్రపంచంలో ఎక్కువ జనసాంద్రత ఉన్న దేశాలేవంటే..

  • ప్రపంచంలో అత్యధిక జన సాంద్రత ఉన్న దేశం మకావూ. ఇక్కడ సగటున ప్రతి చదరపు కిలోమీటర్ కు జనాభా ఏకంగా 20,806 మంది.
  • రెండో స్థానంలో ఉన్న మొనాకో దేశంలో ప్రతి చదరపు కిలోమీటర్ కు సగటున 17,604 మంది ఉంటారు.
  • సింగపూర్ సగటున 7,595 మంది జన సాంద్రతతో మూడో స్థానంలో ఉంది.
  • హాంగ్ కాంగ్ ప్రతి చదరపు కిలోమీటర్ కు 7,060 మంది జనాభాతో నాలుగో స్థానంలో ఉంది.
  • ఐదో స్థానంలోని జీబ్రాల్టర్ జన సాంద్రత ప్రతి కిలోమీటర్ కు 3,267 మంది.
  • బహ్రెయిన్ దేశంలో ప్రతి చదరపు కిలోమీటర్ కు 1,852 మంది జనాభాతో ఆరో స్థానంలో ఉంది.
  • ఏడో స్థానంలోని మాల్దీవుల జన సాంద్రత 1,738 మంది.
  • మాల్టా ప్రతి చదరపు కిలోమీటర్ కు 1,620 మందితో ఎనిమిదో స్థానంలో ఉంది.
  • ప్రతి చదరపు కిలోమీటర్ కు 1,301 మంది జనాభాతో బంగ్లాదేశ్ జన సాంద్రతలో తొమ్మిదో ప్లేస్ లో నిలిచింది.
  • పదో స్థానంలో నిలిచిన దక్షిణ కొరియాలో జన సాంద్రత 530 మంది.

Related posts

భారత్-చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ షురూ !

Ram Narayana

అమెరికాలోని ఓ పట్టణంలో గోధుమ రంగు మంచు.. అధికారుల అలర్ట్

Ram Narayana

భారతీయ విద్యార్థులకు స్టడీ పర్మిట్‌లను భారీగా తగ్గించిన కెనడా

Ram Narayana

Leave a Comment