Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లు దుబాయ్ లో… షెడ్యూల్ ఖరారు…

ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లు దుబాయ్ లో… షెడ్యూల్ ఖరారు
-భారత్ లో కరోనా సెకండ్ వేవ్
-మధ్యలోనే నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్
-భారత్ లో 29 మ్యాచ్ ల నిర్వహణ
-దుబాయ్ లో మిగిలిన 31 మ్యాచ్ ల నిర్వహణ
-సెప్టెంబరు 19 నుంచి టోర్నీ షురూ
-అక్టోబరు 15న ఫైనల్

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా నిలిచిపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. అయితే ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లు జరుగుతాయా లేదా అనే సందేహాలు ఉన్నాయి. అనేకమంది మ్యాచ్ లు జరిగితే ఎక్కడ జరుగుతాయి. దేశంలోనే విదేశాలలోని అనే మీమాంస లో ఉన్నారు. గత సీజన్ లో నిర్వహించిన వేదికైన దుబాయ్ లో నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించింది. తాజాగా దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేసింది.

భారత్ లో ఐపీఎల్ 14వ సీజన్ కు సంబంధించి 29 మ్యాచ్ లు జరగ్గా, మిగిలిన 31 మ్యాచ్ లను దుబాయ్ వేదికగా నిర్వహిస్తారు. సెప్టెంబరు 19న ఐపీఎల్ పోటీలు షురూ అవుతాయి. అక్టోబరు 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా, ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లు వచ్చేది అనుమానంగా మారింది. తాము రాలేమంటూ ఇప్పటికే పలువురు ఆటగాళ్లు సంకేతాలిచ్చారు. దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.

Related posts

ముంబయి టెస్టు: ముగిసిన మూడో రోజు ఆట…విజయానికి 5 వికెట్ల దూరంలో భారత్!

Drukpadam

క్రికెటర్ అవ్వాలనుకునే వారి కోసం.. అతి త్వరలో చెన్నై సూపర్ కింగ్స్ అకాడమీ

Drukpadam

ఆసియ కప్ ఫైనల్ విజేత భారత్ …శ్రీలంక చిత్తు చిత్తు …సిరాజ్ కు 6 వికెట్లు …!

Ram Narayana

Leave a Comment