Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ నారాయణ సూచన…

  • జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా రూపొందించడం అభినందనీయమన్న నారాయణ
  • రాష్ట్ర చిహ్నం మార్చకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డ సీపీఐ నేత
  • రేవంత్ రెడ్డి రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచన
  • రాష్ట్ర గీతాన్ని కీరవాణి కంపోజ్ చేయడంలో తప్పేమిటన్న నారాయణ
  • ఏపీలో వైసీపీ గెలిచే అవకాశాలు లేవని జోస్యం
  • కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుంటే చంద్రబాబు ఇండియా కూటమిలో చేరాలని విజ్ఞప్తి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచన చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా రూపొందించడం అభినందనీయమని… అయితే రాష్ట్ర చిహ్నం మార్చకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలని సూచించారు.

రాష్ట్ర గీతం కంపోజ్ చేయానికి కీరవాణిని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పెడితే తప్పేమిటి? అని ప్రశ్నించారు. కళలకు ప్రాంతీయ భేదాలు ఉండవన్నారు. కళలకు హద్దులు గీయడం సరికాదన్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ వైఖరిని ఖండిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ ధ్యానం చేయడమంటే కన్యాకుమారిని కలుషితం చేయడమేనని విమర్శించారు.

వైసీపీ గెలిచే అవకాశాలు లేవు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా నారాయణ స్పందించారు. వైసీపీ గెలిచే అవకాశాలు లేవని జోస్యం చెప్పారు. కావాలనే విశాఖలో ప్రమాణస్వీకారం అంటూ వైసీపీ నేతలు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కౌంటింగ్ గురించి కూడా వైసీపీ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారన్నారు. దానిని బట్టే వైసీపీ ఓడిపోతుందని అర్థం చేసుకోవచ్చునన్నారు. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి రాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు ఇండియా కూటమితో జత కట్టాలని కోరుకుంటున్నానన్నారు.

Related posts

మిల్లెట్స్ అందరికీ సరిపడకపోవచ్చు..!

Drukpadam

అమరావతి రాజధాని కేసు జులై 11 వాయిదా…!

Drukpadam

The Best 8 Face Oils for People With Oily Skin

Drukpadam

Leave a Comment