- అధికారం నిలబెట్టుకున్న బీజేపీ
- మెజారిటీ మార్క్ 31 స్థానాల్లో గెలుపు
- కొనసాగుతున్న కౌంటింగ్
- సిక్కింలో ఎస్ కేఎం జయకేతనం
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ఈసీ ప్రకటించింది. మార్చి 18న జరిగిన అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల్లో ఇంకా కౌంటింగ్ కొనసాగుతోంది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ, సిక్కింలో సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్ కేఎం) మెజారిటీ మార్కును ఇప్పటికే దాటేశాయని ఈసీ వెల్లడించింది. సిక్కింలో మరోసారి ఎస్ కేఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 18 స్థానాల్లో ఎస్ కేఎం అభ్యర్థులు గెలుపొందగా.. మరో 13 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు ఫలితాల్లో కనిపిస్తోంది.