Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ప్రగతి భవన్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం… అడ్డుకున్న పోలీసులు…

ప్రగతి భవన్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం… అడ్డుకున్న పోలీసులు
.ప్రగతి భవన్ వద్ద అన్నదమ్ముల కలకలం
.ఒకరు శరీరంపై కిరోసిన్ పోసుకున్న వైనం
.మరొకరు మంత్రుల కాన్వాయ్ కి అడ్డంగా వెళ్లే ప్రయత్నం
.ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ ప్రగతి భవన్ వద్ద క్యాబినెట్ సమావేశం ప్రారంభం కావడానికి కొద్ది ముందుగా ఇద్దరు అన్నదమ్ములు కలకలం రేపారు. వారిలో ఓ వ్యక్తి ప్రగతి భవన్ ఎదుట శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు సకాలంలో అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఆ వ్యక్తి సోదరుడు మంత్రుల కాన్వాయ్ కి అడ్డంగా వెళ్లేందుకు యత్నించాడు. ఈ సోదరులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిది గ్రేటర్ పరిధిలోని కొంపల్లి అని గుర్తించారు.

కాగా, ఓ సివిల్ వివాదంలో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని,పైగా తమనే వేధిస్తున్నారని వారు ఆరోపణ . అందుకే ప్రగతి భవన్ ఎదుట ఆందోళనకు యత్నించామని ఆ అన్నదమ్ములు వెల్లడించారు. ఫిర్యాదు చేసిన తమనే పోలీసులు వేధిస్తున్నారని వారు ఆరోపించారు.సమస్య ముఖ్యమంత్రి ,మంత్రుల దృష్టికి తీసుకోని పోవాలని తమకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ప్రగతి భవన్ ముందు ఆందోళనకు సిద్ధమైయ్యామని వారు అన్నారు. పోలీసులు వారిని ఆడుపోలేకి తీసుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

మోసం కేసులో గాంధీ ముని మనవరాలికి ఏడేళ్ల జైలు!

Drukpadam

గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి.. వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Ram Narayana

అసెంబ్లీ ముట్టడికి పలుసంఘాల ప్రయత్నం …లాఠీచార్జి ,అరెస్టులు.. ప‌రిస్థితి ఉద్రిక్తం…

Drukpadam

Leave a Comment