Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

  • ఎన్డీఏ కూటమికి 293 సీట్లు.. మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి ప్రధాని కానున్న మోదీ
  • 99 సీట్లలో గెలిచిన కాంగ్రెస్.. ఇండియా కూటమికి 235 సీట్లు
  • ఈసారి 240 సీట్లకే పరిమితమైన బీజేపీ.. 2019తో పోలిస్తే తగ్గిన సీట్లు
  • సొంతంగా 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ చేరలేకపోయిన వైనం

దేశవ్యాప్తంగా 543 ఎంపీ సీట్లకుగాను 542 సీట్ల ఫలితాలను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మహారాష్ర్టలోని బీడ్ నియోజకవర్గం ఫలితం ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. అక్కడ ప్రస్తుతానికి బీజేపీ అభ్యర్థి పంకజా ముండేపై ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థి బజ్ రంగ్ మనోహర్ సోన్వానే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ సూరత్ నియోజకవర్గ అభ్యర్థి ముకేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో అక్కడ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ అవసరం రాలేదు.

ఈ ఎన్నికల్లో మొత్తంమీద కేంద్రంలోని అధికార బీజేపీ 240 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లను మాత్రం సాధించలేకపోయింది. ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ 16 సీట్లు, జేడీయూ 12 సీట్లతోపాటు ఇతర మిత్రపక్ష పార్టీల మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. మొత్తంగా ఎన్డీఏ కూటమి 293 సీట్లలో బలం పొందింది. దీంతో ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో సొంతంగా 303 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2014 లోక్ సభ ఎన్నికల్లో 282 సీట్లు గెలుచుకుంది. 

మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించింది. 2019 ఎన్నికల్లో సాధించిన 52 సీట్ల సంఖ్యను దాదాపుగా రెట్టింపు చేసుకుంది. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన విపక్ష ఇండియా కూటమిలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ యూపీలో 37 సీట్లలో విజయఢంకా మోగించింది. ఇక ఈ కూటమిలోని మరో పార్టీ అయిన పార్టీ తృణమూల్ కాంగ్రెస్ సైతం 29 సీట్లలో గెలుపొందింది. 2019 ఎన్నికల్లో సాధించిన 22 ఎంపీ సీట్ల లెక్కను మెరుగుపరుచుకుంది. రాజస్తాన్, హర్యానాలలో బీజేపీ సీట్లకు కాంగ్రెస్ గండికొట్టగా యూపీలో బీజేపీ సీట్లకు సమాజ్ వాదీ పార్టీ ఎసరుపెట్టింది. మొత్తంగా ఇండియా కూటమి 235 సీట్లు సాధించింది.


పార్టీ పేరుసీట్లు
భారతీయ జనతా పార్టీ – BJP240
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ – INC99
సమాజ్‌వాది పార్టీ – SP37
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ – AITC29
ద్రవిడ మున్నేట్ర కజగం – DMK22
తెలుగు దేశం – TDP16
జనతా దళ్ (యునైటెడ్) – JD(U)12
శివసేన (ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే) – SHSUBT9
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్‌చంద్ర పవార్ – NCPSP8
శివసేన – SHS7
లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) – LJPRV5
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ – YSRCP4
రాష్ట్రీయ జనతా దళ్ – RJD4
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) – CPI(M)4
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ – IUML3
ఆమ్ ఆద్మీ పార్టీ – AAAP3
జార్ఖండ్ ముక్తి మోర్చా – JMM3
జనసేన పార్టీ – JnP2
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) (లిబరేషన్) – CPI(ML)(L)2
జనతా దళ్ (సెక్యులర్) – JD(S)2
విడుతలై చిరుతైగల్ కాచ్చి – VCK2
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా – CPI2
రాష్ట్రీయ లోక్ దళ్ – RLD2
జమ్మూ & కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ – JKN2
యునైటెడ్ పీపుల్స్ పార్టీ, లిబరల్ – UPPL1
అసోం గణ పరిషత్ – AGP1
హిందుస్థానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్) – HAMS1
కేరళ కాంగ్రెస్ – KEC1
రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ – RSP1
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – NCP1
వాయిస్ ఆఫ్ ద పీపుల్ పార్టీ – VOTPP1
జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ – ZPM1
శిరోమణి అకాళి దళ్ – SAD1
రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ – RLTP1
భారత్ ఆదివాసి పార్టీ – BHRTADVSIP1
సిక్కిం క్రాంతికారి మోర్చా – SKM1
మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం – MDMK1
ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) – ASPKR1
అప్నా దళ్ (సోనెలాల్) – ADAL1
AJSU పార్టీ – AJSUP1
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తేహదుల్ ముస్లిమీన్ – AIMIM1
స్వతంత్రులు – IND7
మొత్తం543

Related posts

టైమ్స్ నౌ సర్వే లో మోడీ , జగన్ , కేసీఆర్ లకు తిరుగు లేదు …

Ram Narayana

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు: అజిత్ పవార్

Ram Narayana

కోల్‌కతా ఘటన.. మమతా బెనర్జీ-కేంద్రం మధ్య ఉత్తరాల యుద్ధం!

Ram Narayana

Leave a Comment