శనివారం ఉదయం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశాఖపట్నం పరిధిలోని ఎండాడలోని వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమతులు లేకుండా నిర్మించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై వారంలోపు వివరణ ఇవ్వాలని జీవీఎంసీ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే అధికారులు కార్యాలయానికి నోటీసులు అంటించారు. సర్వే నం. 175/4లో అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని నోటీసులో పేర్కొన్నారు. రెండు ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేశారని అభ్యంతరం తెలిపారు.