Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్సీ అమలుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!

ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్సీ అమలుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్!
-30 శాతం పెంపుతో పీఆర్సీకి మంత్రి మండలి ఆమోదం
-కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా వర్తింపు
-జూన్ నెల నుంచే పెంపును వర్తింప జేయాలని నిర్ణయం
-త్వరలోనే ఉత్తర్వులు

తెలంగాణలో ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుభవార్త చెప్పారు. సీఎం అధ్యక్షతన గత రాత్రి జరిగిన మంత్రిమండలి సమావేశంలో 30 శాతం పెంపుతో పీఆర్సీ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. జూన్ నెల నుంచే పెంపును వర్తింపజేయాలని కూడా మంత్రి మండలి నిర్ణయించింది. అంటే జులై నుంచి పెరిగిన వేతనం అందుతుంది. నిజానికి మార్చి 22నే పీఆర్సీ ప్రకటించినప్పటికీ కరోనా సంక్షోభం నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది.

కాగా, నోషనల్ బెనిఫిట్‌ను 1 జులై 2018 నుంచి, ఆర్థిక లబ్ధిని 1 ఏప్రిల్ 2020 నుంచి అమలు చేస్తారు. వేతనాల్లో మార్పును 1 ఏప్రిల్ 2021 నుంచి అమలు చేయనున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Related posts

ప్రకాశం జిల్లాలో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్ధులు గల్లంతు…

Ram Narayana

ప్రగతిభవన్‌లో జెండా ఆవిష్కరించిన కేసీఆర్‌.. ప‌లు జిల్లాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుక‌లు

Drukpadam

డిప్లమో ఇన్ కంప్యూటర్ బదులు బీకామ్ అనేది ప్రింటింగ్ మిస్టేక్ :అశోక్ బాబు!

Drukpadam

Leave a Comment