- ముంబయిలో అంగరంగవైభోగంగా అనంత్ అంబానీ పెళ్లి
- ఆహ్వానం లేకుండా పెళ్లికి వెళ్లిన అల్లూరి వెంకటేశ్, షఫీ షేక్
- ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
రిలయన్స్ వ్యాపార సామ్రాజ్య అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహం ముంబయిలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు వచ్చి సందడి చేశారు. అదే సమయంలో, కొందరు పిలవని పేరంటాల్లా అంబానీ ఇంట పెళ్లికి హాజరయ్యారు.
తాజాగా, అనంత్ అంబానీ పెళ్లికి ఆహ్వానం లేకుండా వెళ్లిన ఇద్దరు ఏపీ యువకులపై కేసు నమోదైంది. వారిద్దరిలో అల్లూరి వెంకటేశ్ అనే యువకుడు యూట్యూబర్. మరో యువకుడి పేరు షఫీ షేక్.
ఈ ఇద్దరు యువకులు ఆహ్వానం లేకుండా అంబానీ ఇంట్లో పెళ్లికి వచ్చారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో వారిద్దరిపై వేర్వేరుగా కేసులు నమోదు చేసుకున్న ముంబయి బీకేసీ పోలీసులు… ఆ ఏపీ యువకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, నోటీసులు ఇచ్చి వదిలేశారు.