Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సత్తుపల్లి లో 100 పడకల నూతన ఆసుపత్రి భవనం : సీఎం కేసీఆర్

సత్తుపల్లి లో 100 పడకల నూతన ఆసుపత్రి భవనం : సీఎం కేసీఆర్
– సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సండ్ర
-సత్తుపల్లి ప్రజల చిరకాల కోరిక తీరిందన్న సండ్ర వెంకటవీరయ్య
-ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిని మాట శిశు సంక్షేమ సంరక్షణ కేంద్రంగా మార్పు

సత్తుపల్లి లో ఎప్పటినుంచో ప్రభుత్వ ఆసుపత్రికి స్థాయి పెంచాలని , కొత్త బిల్డింగ్ నిర్మించాలనే కోరిక నేటికీ నెరవేరింది. స్థానిక ఎమ్మెల్యే సండ్ర విజ్నప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సత్తుపల్లి 100 పడకల ఆసుపత్రి నూతన భావన నిర్మాణానికి అనుమతులు మంజూరి చేశారు. ఇప్పుడున్న భవనాన్ని మాట శిశు సంక్షేమ సంరక్షణ కేంద్రంగా మార్చనున్నట్లు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే హర్షతిరేకలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాదులో సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో సత్తుపల్లిలో సకల సౌకర్యాలతో ,100 బెడ్ లతో ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనాన్ని మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం నిర్మితమై ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి 1978 వ సంవత్సరంలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మించారని ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో నూతన భవనాన్ని మంజూరు చేయాలని పూర్వం ముఖ్యమంత్రి కెసిఆర్ని కలిసి కోరగా, సత్తుపల్లి ప్రజల చిరకాల వాంఛ 100 బెడ్ ల నూతన భవనాన్ని మంజూరు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రిని మాతా శిశు సంరక్షణ కేంద్రంగా వినియోగించుకోవాలని సూచించినట్లుగా తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల కోసం సత్తుపల్లి వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రిని అభివృద్ధి పథంలో నిలిపామని సకల సౌకర్యాలను ఏర్పాటు చేశామని అత్యాధునిక సౌకర్యాలతో డయాలసిస్ సెంటర్ ను ఏర్పాటు చేసి సేవలు అందించడం జరిగిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. కరోనా రోగులకు వైద్యం అందించడంలో భాగంగా సత్తుపల్లి, పెనుబల్లి మండల కేంద్రాల్లో నియోజకవర్గ ప్రజల కోసం 100 పడకలతో ఆక్సిజన్ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుచేసి మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని, ఆసుపత్రి నందు రెమిడి సివర్ ఇంజక్షన్, మందుల కొరత లేకుండా వైద్య సౌకర్యాలు సహాయ సహకారాలను అందించామని, కరోనా రోగులకు రెండు పుట్ల పౌష్టికాహారాన్ని అందించామని నియోజకవర్గంలో గ్రామగ్రామాన ఇసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధుల సహకారంతో వారికి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసి సహకారాన్ని అందించామన్నారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ప్రతి రోజూ 100 మినరల్ వాటర్ బాటిల్ ను అందించామని, కరోనా తీవ్రత తగ్గే వరకు కూడా ఆసుపత్రిలో రోగులకు ఆక్సిజన్ అందించేందుకు సింగరేణి సి.ఎం.డి గారితో మాట్లాడి ఆక్సిజన్ కొరత లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా నియోజకవర్గంలో రోజుకు 3500 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వంతో మాట్లాడి ఆదేశాలు జారీ చేయించామన్నారు. కరోనా నియంత్రణకు చర్యల్లో భాగంగా ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేసి కఠినమైన చర్యలుతో రాకపోకలు నిలిపివేసి, లాక్ డౌన్ నిబంధనలు, గ్రామా స్థాయి ఆశ వర్కర్లు వైద్యుల పర్యవేక్షణలతో 38 శాతం ఉన్న నమోదు రేటును 6.11 శాతానికి తగ్గించగలిగామన్నారు. నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జ్వర సర్వే సత్ఫలితాన్ని ఇచ్చిందని లక్షణాలు అనుమానం ఉన్న వారికి 6500 మెడికల్ కిట్లు ఇచ్చి కరోనాని అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు

Related posts

పరువు నష్టం కేసుపై అప్పీల్ కు రాహుల్ గాంధీ…!

Drukpadam

ఏపీ సీఎంవోలో డిజిటల్ సంతకాల దుర్వినియోగం కేసులో ఐదుగురి అరెస్టు

Ram Narayana

పిండిప్రోలు సర్పంచ్ కామ్రేడ్ రాయల నాగేశ్వరరావు కన్నుమూత!

Drukpadam

Leave a Comment