Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలోకి ఈటల : గుత్తా సుఖేందర్ రెడ్డి

ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలోకి ఈటల : గుత్తా సుఖేందర్ రెడ్డి
-ఈటల తనను తాను రాజకీయంగా నాశనం చేసుకున్నారు
-ఈటలకు కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని వెల్లడి
-ఉప ఎన్నికలో ఈటలకు ఓటమి ఖాయమని స్పష్టీకరణ

రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అని ,ఈటల రాజేందర్ టీఆర్ యస్ వీడి తనకు తనకు తానే ఆత్మహత్య చేసుకున్నారని మండలి చైర్మన్ గుట్ట సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ అయిన తరువాత ఈటల బీజేపీ లో చేరేందుకు చేస్తున్న సన్నాహాలపై గుత్తా స్పందించారు. ఆయనకు టీఆర్ యస్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు . దాన్ని అనవసరంగా నాశనం చేసుకున్నారు. బీజేపీ మునుగుతున్న పడవ లాంటిది . మోడీ ప్రభ దేశంలో మసక బారుతుంది. తాత్కాలిక ప్రయోజనాలకోసం బీజేపీ లో చేరడం అంటే ఆత్మహత్య సదృశ్యమే అని ఈటల పై విమర్శలు గుప్పించారు.
ఈటల రాజేందర్ కు సీఎం కేసీఆర్ ఎంతో గుర్తింపు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. ఈటల రాజకీయంగా తనను నాశనం చేసుకున్నారని విమర్శించారు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని, ఎవరూ ఎవర్నీ నాశనం చేయలేరని తెలిపారు.

ఇవాళ తన ఆస్తులను రక్షించుకోవడం కోసమే ఈటల బీజేపీలోకి వెళుతున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ పతనమవుతోందని అన్నారు. ఉప ఎన్నికలో ఈటలకు ఓటమి ఖాయమని గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ లో చేరడం కోసం పార్టీపైన కేసీఆర్ పైన విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. వామపక్షవాదినన్న ఈటల మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీలోకి వెళ్లడం అంటే ఆస్తులు కాపాడుకునేందుకు కాకా మరి దేనికని ప్రశ్నించారు. రాష్ట్రలో కేసీఆర్ పాలనా బాగుంది. మరో రెండు దశాబ్దాల పాటు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురులేదని ధీమాగా చెప్పారు. 2026 ఎన్నికల నాటికి రిజర్వేషన్లు మారతాయని, నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా అప్పటికి పూర్తవుతుందని తెలిపారు.

Related posts

కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై దుమ్మెత్తి పోస్తున్న విపక్షాలు!

Drukpadam

కేంద్రంపై కేసీఆర్ నిప్పులు …బీజేపీని బంగాళాఖాతంలో కలపాలని పిలుపు!

Drukpadam

ప్రధాని కంట కన్నీరు

Drukpadam

Leave a Comment