Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చైనా జాతీయుడిని అదుపులోకి తీసుకున్న భారత భద్రతా బలగాలు!

బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చైనా జాతీయుడిని అదుపులోకి తీసుకున్న భారత భద్రతా బలగాలు!
అనుమానాస్పదంగా చైనా వ్యక్తి
పశ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లాలో పట్టుబడిన వైనం
కాలియాచక్ పోస్టు వద్దకు తీసుకువచ్చిన జవాన్లు
చైనీయుడ్ని ప్రశ్నిస్తున్న భద్రతా సంస్థలు

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఓ చైనీయుడు భద్రతా బలగాలకు పట్టుబడ్డాడు. అనుమానాస్పద చర్యల కారణంగా అతడిని పశ్చిమ బెంగాల్ లోని మాల్డా జిల్లాలో నిర్బంధంలోకి తీసుకున్నట్టు బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) అధికారులు తెలిపారు. ఆ చైనా జాతీయుడి పేరును హాన్ జున్ వీయ్ అని గుర్తించారు. అతడి నుంచి చైనా పాస్ పోర్టు, బంగ్లాదేశ్ వీసా, ఒక ల్యాప్ టాప్, మూడు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

సరిహద్దు ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో ఉదయం 7 గంటలకు అదుపులోకి తీసుకున్నట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. అతడిని కాలియాచక్ పోస్టు వద్దకు తీసుకువచ్చి, ఇతర భద్రతా సంస్థలకు సమాచారం అందించామని వెల్లడించారు. ప్రస్తుతం ఆ చైనా జాతీయుడిని ఇతర భద్రతా సంస్థల అధికారులు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. అతను ఎందుకు వచ్చింది తెలుసుకొనే పనిలో విచారణ చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

Related posts

భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేసిన భార్య.. ప్రియుడితో కలిసి ఘాతుకం!

Drukpadam

ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించిన పెట్రోలింగ్ పోలీసులు …విచారణకు ఆదేశించిన సీపీ!

Drukpadam

టెక్కీ దీప్తి మృతి కేసు: చందన, ఆమె ప్రియుడు అరెస్ట్?

Ram Narayana

Leave a Comment