Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఉత్తరాఖండ్ లో నర్స్ పై హత్యాచారం.. 9 రోజుల తర్వాత డెడ్ బాడీ గుర్తింపు

  • ఆసుపత్రి నుంచి ఇంటికి వెళుతుండగా ఎత్తుకెళ్లిన దుండగుడు
  • అత్యాచారం చేసి ప్రాణం తీసి ఆపై దోచుకున్న వైనం
  • జులై 30 నుంచి మిస్సింగ్.. ఆగస్టు 8న పొదల్లో మృతదేహం గుర్తింపు

కోల్ కతాలో వైద్యురాలిపై జరిగిన ఘోరం తరహాలోనే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్ లో ఓ నర్స్ పై అఘాయిత్యం జరిగింది. నర్స్ పై అఘాయిత్యం చేసిన దుండగుడు ఆ తర్వాత ఆమెను చంపేశాడు. బాధితురాలి సోదరి ఫిర్యాదుతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు 9 రోజుల తర్వాత మృతదేహం దొరికింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లోని బిలాస్ పూర్ లో చోటుచేసుకుందీ దారుణం. పోలీసులు, బాధితురాలి బంధువుల వివరాల ప్రకారం..

బిలాస్ పూర్ కు చెందిన ఓ మహిళ ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్ గా పనిచేస్తోంది. పదకొండేళ్ల కూతురుతో బిలాస్ పూర్ లో ఉంటూ రోజూ రుద్రపూర్ కు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలోనే జులై 30న డ్యూటీకి వెళ్లిన బాధితురాలు రాత్రి ఇంటికి తిరిగిరాలేదు. బాధితురాలి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆసుపత్రికి ఫోన్ చేయగా సాయంత్రం వెళ్లిపోయిందని చెప్పారు. దీంతో మరుసటి రోజు ఉదయం బాధితురాలి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ఓ ఆటోలో బాధితురాలు బయలుదేరడం కనిపించింది. ఆ తర్వాత ఎటు వెళ్లిందనేది తెలియలేదు. వారం రోజుల తర్వాత బిలాస్ పూర్ లోని బాధితురాలి ఇంటికి సమీపంలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

నిందుతుడి కోసం గాలిస్తున్న పోలీసులకు బాధితురాలి ఫోన్ ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీకి చెందిన రోజు కూలీ ధర్మేంద్ర దగ్గర దొరికింది. దీంతో ధర్మేంద్రను విచారించగా.. జులై 30న ఆటో దిగి తనుండే అపార్ట్ మెంట్ లోకి వెళుతున్న నర్స్ ను బలవంతంగా పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లానని చెప్పాడు. నర్స్ పై అత్యాచారం చేసి, అనంతరం ఆమె స్కార్ఫ్ తోనే మెడకు బిగించి హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఆమె ఫోన్ తో పాటు పర్స్ లో ఉన్న రూ.3 వేలు తీసుకున్నానని వివరించాడు.

Related posts

హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్.. విడుదల

Drukpadam

రఘురామకు వైద్య పరీక్షలు పూర్తి… గుంటూరు జిల్లా జైలుకు తరలింపు…

Drukpadam

విద్వేష ప్రసంగం కేసు: యతి నర్సింగానంద్ అరెస్ట్!

Drukpadam

Leave a Comment