Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

గోవాలో జానీ మాస్టర్ అరెస్టు!


జానీ మాస్టర్‌ను గోవా కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడి

పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించినట్లు వెల్లడి

ఫోక్సోకేసుతో పాటు రేప్ కేసు నమోదు చేశామన్న పోలీసులు


ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను గోవాలో అరెస్ట్ చేశామని ఎస్వోటీ పోలీసులు వెల్లడించారు. జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసి గోవా కోర్టులో హాజరుపరిచామని, పీటీ వారెంట్‌పై ఆయనను తరలించామన్నారు. రేపు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. అతనిపై పోక్సో కేసుతో పాటు రేప్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధితురాలి స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్ చేసినట్లు తెలిపారు.

ఫిర్యాదులో ఏముందంటే?

జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేసిన యువతి ఫిర్యాదులో వివిధ అంశాలు పేర్కొంది. తనకు 2017లో జానీ మాస్టర్ పరిచయం అయ్యాడని, 2019లో అతని గ్రూప్‌లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరానని తెలిపింది. ఓ సినిమా చిత్రీకరణ కోసం ముంబైకి వెళ్లినప్పుడు అక్కడ హోటల్లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే గ్రూప్ నుంచి తొలగిస్తానని, తనను దాటి వెళితే పరిశ్రమలో పని చేయలేవని బెదిరించాడని తెలిపింది.

ఆ తర్వాత తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. షూటింగ్ సమయంలో వ్యానిటీ వ్యా‌న్‌లో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపింది. ఓసారి అతని కోరికను తీర్చనందుకు తన జుత్తును పట్టుకొని అద్దానికి కొట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. అతని వేధింపులు భరించలేక అతని బృందం నుంచి బయటకు వచ్చానని తెలిపింది. కానీ తనను సొంతంగా పని చేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రాకుండా ఇబ్బంది పెట్టాడని తెలిపింది.

జానీ మాస్టర్ ను వదలొద్దు.. కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు

Karate Kalyani Reaction On Jhony Master Issue
  • డాన్స్ మాస్టర్ అయినంత మాత్రాన మద్దతివ్వాల్సిన పనిలేదన్న నటి
  • అత్యాచారం, మతమార్పిడికి ప్రయత్నం కచ్చితంగా లవ్ జిహాదేనని ఫైర్
  • జానీ మాస్టర్ బాధితురాలికి అండగా నిలబడాలంటూ పిలుపు

జానీ మాస్టర్ కేసు ముమ్మాటికీ లవ్ జిహాదేనని నటి కరాటే కల్యాణి మండిపడ్డారు. డ్యాన్స్ మాస్టరో.. పక్క రాష్ట్రంలోని ఓ పార్టీ నేత అనో జానీ మాస్టర్ కు మద్దతుగా ఉండాల్సిన పనిలేదని ఆమె అన్నారు. ఓ అమ్మాయిపై అత్యాచారం చేసిన, మతం మార్చుకోవాలని వేధింపులకు గురిచేసిన జానీ మాస్టర్ ను వదలొద్దని తెలంగాణ ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. 

జానీ మాస్టర్ పై నమోదైన అత్యాచార కేసుపై కరాటే కల్యాణి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. “కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా, ఎవరినోట విన్నా జానీ మాస్టర్ నిర్వాకంపైనే చర్చ జరుగుతోంది. హిందూ అమ్మాయిని ఆయన అత్యాచారం చేయబోయారు, చేశారు, ఆమెను హింసించారని అంటున్నారు. బాధితురాలిని మతం మార్చుకోవాలంటూ వేధింపులకు గురిచేశాడని చెబుతున్నారు. ఇది కచ్చితంగా లవ్ జిహాద్ కేసే.. జానీ మాస్టర్ ను వదలొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాను” అన్నారు.

జానీ మాస్టర్ చేతిలో వేధింపులకు గురైన అమ్మాయిని, ఆమె ఆవేదనను అర్థం చేసుకోవాలని, న్యాయం జరిగే వరకూ ఆమెకు అండగా నిలబడాలని కరాటే కల్యాణి కోరారు. తాను కూడా ఆ అమ్మాయికి మద్దతుగా ఉంటానని చెప్పారు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రాజకీయ పార్టీ ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు.

జానీ మాస్ట‌ర్ అరెస్ట్‌… నాగ‌బాబు ఆస‌క్తిక‌ర‌ ట్వీట్స్‌!

Naga Babu Interesting Tweet goes Viral on Social Media

అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ప్ర‌ముఖ‌ కొరియోగ్రఫర్‌ జానీ మాస్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన నేత‌, మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్టులు పెట్టారు. ఈ మేర‌కు ఆయ‌న ఇద్ద‌రు ప్ర‌ముఖుల కొటేష‌న్ల‌తో రెండు ట్వీట్లు చేశారు. 

“చ‌ట్ట ప్ర‌కారం నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు” అనే సర్ విలియం గారో కోట్‌ను పోస్ట్ చేశారు. 

అలాగే “మీరు వినేదే న‌మ్మొద్దు. ప్ర‌తి క‌థ‌కు మూడు కోణాలు ఉంటాయి… మీది, అవ‌త‌లి వారిది, నిజానిది” అనే రాబ‌ర్ట్ ఇవాన్స్ కోట్‌ను కూడా ట్వీట్ చేశారు. 

దీంతో జానీ మాస్ట‌ర్‌కు మ‌ద్ద‌తుగా నాగ‌బాబు ఈ పోస్టులు చేశార‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు అత్యాచార కేసు న‌మోదు కావ‌డంతో జానీపై జ‌న‌సేన పార్టీ వేటు వేసిన విష‌యం తెలిసిందే.

పారిపోవడం అనేది సమాజానికి ప్రమాదకర సందేశాన్ని ఇస్తుంది: జానీ మాస్టర్ వ్యవహారంపై మంచు మనోజ్ వ్యాఖ్యలు

Manchu Manoj responds on Jani Master issue

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేయడంపై నటుడు మంచు మనోజ్ స్పందించారు. 

ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని… ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని హితవు పలికారు. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే ఆ విషయాన్ని అంగీకరించండి అని మంచు మనోజ్ స్పష్టం చేశారు. 

“జానీ మాస్టర్… మీరు కెరీర్ లో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు… కానీ మీపై ఈస్థాయిలో ఆరోపణలు రావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది. ఎవరిది తప్పు అనేది చట్టం చూసుకుంటుంది. 

ఈ వ్యవహారంలో వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులకు అభినందనలు తెలుపుతున్నాను. చట్టానికి ఎవరూ అతీతులు కారన్న విషయం దీనితో స్పష్టమవుతోంది” అని మంచు మనోజ్ పేర్కొన్నారు.

దొంగలకు ఇచ్చే ట్రీట్మెంట్ జానీ మాస్టర్‌కు ఇవ్వాలి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

Goshamahal BJP MLA T RajaSingh calls for the panishment of Jani Master from the film industry
  • రౌడీలకు, హంతకులకు ఇచ్చే ట్రీట్మెంట్‌ను జానీ మాస్టర్‌కు ఇవ్వాలన్న రాజాసింగ్
  • జానీ మాస్టర్ వంటి వ్యక్తిని సినిమా పరిశ్రమ బహిష్కరించాలని విజ్ఞప్తి
  • జానీ మాస్టర్ గురించి అసలు విషయాలు వెలుగులోకి రావాలన్న రాజాసింగ్

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్‌పై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దొంగలకు, రౌడీలకు, హంతకులకు ఇచ్చే ట్రీట్మెంట్‌నే ఆయనకు ఇవ్వాలన్నారు. మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన ఇలాంటి వ్యక్తిని సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని టాలీవుడ్‌కు సూచించారు.

తన వద్ద అసిస్టెంట్‌గా ఉన్న యువతిని మతం మార్చుకోమని చెప్పి జానీ మాస్టర్ హింసించారని ఆరోపించారు. మహిళల భద్రత కోసం బలమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. జానీ మాస్టర్ కేసులో అసలు విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు.

జానీ మాస్టర్ ఎంతమందిని ఇబ్బందులు పెట్టారు, ఎంతమంది పట్ల లవ్ జిహాద్ ప్రయోగించారో తెలియాల్సి ఉందన్నారు. సినిమా పరిశ్రమలో జానీ మాస్టర్ వంటి వారు చాలామంది ఉన్నారని మండిపడ్డారు. జానీ మాస్టర్ లాంటి వారి వల్ల సినీ పరిశ్రమకు చెడ్డపేరు వస్తుంది కాబట్టి అలాంటి వారిని పక్కన పెట్టాలని సూచించారు.

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను ఎస్వోటీ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. గోవా కోర్టులో హాజరుపరిచి, పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. జానీ మాస్టర్‌ను రేపు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు.

Related posts

యూపీలో విషాదం.. ఇంట్లో మంటలు చెలరేగి ఐదుగురు కుటుంబ సభ్యుల సజీవ దహనం…

Drukpadam

గోరంట్లలో దారుణం…విద్యార్థినిపై సామూహిక అత్యాచారం.. బాధిత యువతి మృతి!

Drukpadam

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పై ఐటీ పంజా… రూ.1000 కోట్ల విలువైన ఆస్తుల జప్తు!

Drukpadam

Leave a Comment