ప్రజల నుంచి రూ. 300 కోట్లకుపైగా సొమ్ము వసూలు చేసి పరారైన ఓ వ్యక్తి సాధువు వేషంలో ఉత్తరప్రదేశ్‌లోని మథురలో పోలీసులకు చిక్కాడు. మహరాష్ట్రకు చెందిన బబ్బన్ విశ్వనాథ్ షిండే అధిక వడ్డీల ఆశతో ప్రజల నుంచి రూ. 300 కోట్లను డిపాజిట్ల రూపంలో సేకరించారు.
ఆ తర్వాత ఆ డబ్బుతో ఉడాయించాడు. సేకరించిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేసిన షిండే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సాధువు వేషం ధరించి ఢిల్లీ, అస్సాం, నేపాల్‌తోపాటు యూపీలోని పలు జిల్లాలు తిరిగాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని మంగళవారం రాత్రి మథురలో అరెస్ట్ చేశారు.