Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎంపీ రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా నరసాపురంలో భారీ ర్యాలీ..

ఎంపీ రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా నరసాపురంలో భారీ ర్యాలీ
రఘురామ ఎంపీ సభ్యత్వం భర్తరఫ్ పై పెరుగుతున్న వత్తిడి
ఏపీ బహుజన వేదిక ఆధ్వర్యంలో ర్యాలీ
పోలీసులకు ఫిర్యాదు
రఘురామ దిష్టిబొమ్మ దగ్ధం

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చాలాకాలంగా నియోజకవర్గానికి రావడంలేదు . నియోజకవర్గ సమస్యలపై స్పందించిన సందర్భంలేదు. ఎన్నికైన కొంతకాలం తరువాత ఆయన నియోజవకవర్గానికి మొఖం చాటేయడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయన మాత్రం తాను గెలిచినా పార్టీ అయిన వైసీపీ పై యుద్ధం ప్రకటించారు. రకరకాల మార్గాల ద్వారా ముఖ్యమంత్రి జగన్ పై ప్రభుత్వం నిత్యం ఏదోరకంగా వ్యతిరేకత ప్రదర్శిస్తూనే ఉన్నారు .ఇటీవల ముఖ్యమంత్రికి లేఖల విడుదల చేస్తున్నారు. ఇటీవల ఆయనపై దేశద్రోహం కేసు నమోదు అయింది. ఆయన బెయిల్ పై ఉన్నారు. దేశద్రోహం కేసు లో అరెస్ట్ సందర్బంగా కుటుంబం మొత్తం ఢిల్లీలో అనేకమంది ప్రముఖులను కలిసి రఘురామ పై కేసు , ఎసిబి కస్టడీలో థర్డ్ డిగ్రీ ఉపయోగించారని విన్నయించుకున్నారు .ఆయన కూడా పార్లమెంట్ సభ్యులకు , రాష్ట్రాల గర్నర్లకు ,లేఖలు రాశారు. దీన్ని ఎందుకో సమసిపోయే సమస్యలాకాకుండా సాగదీస్తున్నారు . పైకి ఒంటరి పోరాటం చేస్తున్నట్లు కనపడుతున్న రాజు వెనక కొన్ని శక్తులు ఉండి   ప్రేరేపిస్తున్నాయని వైసీపీ ఆరోపిస్తుంది. ఆయనపై కేసు నమోదు అయినప్పటికీ ఆయనలో ఏమాత్రం తేడాలేదు. జగన్ ప్రభుత్వంపై ఒంటికాలుమీద లేస్తూనే ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా నరసాపురంలో నేడు భారీ ర్యాలీ జరిగింది. ఏపీ బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. రఘురామకృష్ణరాజును ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రఘురామ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. తాము ఓట్లేస్తే రఘురామ ఎంపీగా గెలిచి తమను మోసం చేశాడంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

కాగా, వైసీపీ వెబ్ సైట్ నుంచి ఎంపీల జాబితాలో తన పేరు తొలగించారని నిన్న రఘురామ వెల్లడించారు. రఘురామ పేరును తొలగించి, ఇటీవల తిరుపతి లోక్ సభ స్థానం నుంచి గెలిచిన డాక్టర్ గురుమూర్తి పేరు చేర్చినట్టు తెలుస్తోంది. తన పేరు వైసీపీ తన జాబితానుంచి తొలగించినందున తాను ఇప్పుడు ఇండిపెండెంట్ సభ్యుడననే వాదన ముందుకు తెస్తున్నారు. అందువల్ల వైసీపీ తనపై ఫిర్యాదు చేసిన తన సభ్యత్వం రద్దుకాదని ఆయన భావిస్తున్నారు .

Related posts

హుజూరాబాద్​ లో దళితబంధు అమలులకు ఉత్తర్వులు …

Drukpadam

కాంగ్రెస్ కు ఓటు వేస్తే టీఆర్ఎస్ కు వేసినట్టే:బీజేపీ ఎమ్మెల్యే ఈటల…

Drukpadam

టీఆర్ఎస్ పార్టీకి గట్టు గుడ్ బై!

Drukpadam

Leave a Comment