నా భద్రత కంటే క్షతగాత్రుని ప్రాణాలు ముఖ్యం
మరోమారు మానవత్వం చాటుకున్న మంత్రి పొంగులేటి
కరుణగిరిలో రోడ్డు ప్రమాదం
కాన్వాయ్ ఆపి క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించిన మంత్రి
అరె బాబు ఏమైంది… దెబ్బలు బాగా తగిలినట్టు ఉన్నాయి… ఏం కాదులే నేనున్నా(రోదిస్తున్న క్షతగాత్రునితో)… ముందు అతన్ని కారు ఎక్కించండి…. ఎవరమ్మా అక్కడ (పోలీసు సిబ్బందిని) త్వరగా కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లండి…. ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఆ కారుకు పోలీస్ ఎస్కార్ట్ ను పంపండని మంత్రి పొంగులేటి అన్నారు. ఇది గమనించిన స్థానికులు మానవత్వానికి మారుపేరు పొంగులేటి శీనన్న అంటూ పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్లితే…. తిరుమలాయపాలెం మండల పర్యటనను ముగించుకుని మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఖమ్మంలోని తన క్యాంపు ఆఫీసుకు మంత్రి పొంగులేటి వస్తున్న సమయంలో కరుణగిరి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దీనిని గమనించిన మంత్రి తన కాన్వాయ్ ను ఆపి క్షతగాత్రుని దగ్గరకు వెళ్లి రామర్శించారు. వెంటనే రక్తపుమరకలతో ఉన్న అతనిని కిమ్స్ ఆసుపత్రికి తరలించామని ట్రాఫిక్ సీఐ సాంబశివరావును ఆదేశించడమే కాకుండా తన కోసం వచ్చిన ఎస్కార్ట్ వాహానాన్ని ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా బాధితుని వెంట పంపమని సూచించారు. వెంటనే సీఐ తన సిబ్బంది ద్వారా బాధితున్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.