Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు

  • నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నోటీసులు జారీ
  • రెండో సాక్షి స్టేట్ మెంట్ రికార్డు చేసిన కోర్టు
  • తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా 

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దాఖలు కేసులో ఈ నోటీసులు జారీ అయ్యాయి. అనంతరం తదుపరి విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. 

నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈరోజు రెండో సాక్షి స్టేట్‌మెంట్‌ను కోర్టు రికార్డ్ చేసింది. రెండు రోజుల క్రితమే నాగార్జున, మొదటి సాక్షి సుప్రియ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది.

కొండా సురేఖ త‌న కుటుంబ గౌర‌వాన్ని, ప్ర‌తిష్ఠను దెబ్బ‌తీసేలా నిరాధార వ్యాఖ్య‌లు చేశార‌ని, చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని నాగార్జున నాంపల్లి ప్రత్యేక కోర్టులో ప‌రువు న‌ష్టం పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 

ఇటీవల నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున పేరును కూడా లాగారు. దీంతో ఆయన పరువునష్టం దావా వేశారు.

కొండా సురేఖపై కేటీఆర్ పరువు నష్టం దావా

KTR files defamation case on Konda Surekha
  • నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్
  • తన ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యానించారని పిటిషన్
  • సాక్షులుగా బాల్క సుమన్, దాసోజు శ్రవణ్ తదితరుల పేర్లు

మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు కేటీఆర్ తరఫున ఆయన న్యాయవాది ఉమామహేశ్వరరావు నాంపల్లి ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ పిటిషన్‌లో బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. త‌న ప్ర‌తిష్ఠను దెబ్బ‌తీసేలా కొండా సురేఖ వ్యాఖ్యానించార‌ని కేటీఆర్ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

మంత్రి కొండా సురేఖ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్య, సమంత విడాకులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున పరువునష్టం దావా వేశారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా పరువునష్టం దావా వేశారు.

Related posts

ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన కాశేళ్వరం ప్రాజెక్ట్ పిల్లర్ కుంగుబాటు..

Ram Narayana

హరీశ్, రాజాసింగ్ భేటీ రాజకీయ వర్గాల్లో కలకలం …

Drukpadam

సైఫ్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్య.. ఛార్జిషీట్‌లో కీలక అంశాలు!

Drukpadam

Leave a Comment