Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీపీసీసీ చీఫ్ పై ఉత్కంఠ …. రేవంత్ నా ? జీవన్ రెడ్డి నా ?

టీపీసీసీ చీఫ్ పై ఉత్కంఠ …. రేవంత్ నా ? జీవన్ రెడ్డి నా ?
-రేసులో మధుయాష్కీ , శ్రీధర్ బాబు , భట్టి
-ఏఐసీసీ కార్యదర్శులుగా కోమటిరెడ్డి , మధుయాష్కీ
-కుటుంబంతో సహా ఢిల్లీ చేరుకున్న రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్ష ఎంపిక ఏఐసీసీ కి కత్తిమీద సాముగా మారింది. సంవత్సర కాలంగా వాయిదా పడుతూ వస్తున్నా తెలంగాణ అధ్యక్ష ఎంపిక విషయంలో నేడో రేపో అధ్యక్ష ఎంపిక జరుగుతుందని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఉత్కంఠ నెలకొన్నది. టీపీసీసీ నేతలంతా ఢిల్లీ లో మకాం వేశారు. రేవంత్ రెడ్డి ని టీపీసీసీ చీఫ్ చేస్తారని వస్తున్నా వార్తలపై సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా వి .హనుమంతరావు రేవంత్ రెడ్డి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా టీపీసీసీ పదవి తనకే కావాలని బలంగా కోరుతున్నారు. అయితే సీనియర్లు రేవంత్ ను వ్యతిరేకిస్తున్న ప్రజల్లో ఆయనకు ఉన్న పాపులారిటీ డేషింగ్ నేచర్ వల్ల తెలంగాణాలో పార్టీ నిలబడాలంటే రేవంత్ కే టీపీసీసీ పీఠం కట్టబెట్టాలని అధిష్టానం గట్టిగ అభిప్రాయపడుతోంది. ఇదే విషయాన్నీ టీపీసీసీ ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ కూడా రేవంత్ కే ఇవ్వాలని సిఫార్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఒకవేళ రేవంత్ కానీ పక్షంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. టీపీసీసీ తో పాటు నాలుగైదు సబ్ కమిటీ లను కూడా నియమించే అవకాశం ఉంది. రేవంత్ కు ప్రచార కమిటీ భాద్యతలు అప్పగించే అవకాశం ఉంది.

రాష్ట్ర కాంగ్రెస్ పరిశీలకులు శ్రీనివాస్ , బోసురాజు లు కూడా ఢిల్లీ లో ఉన్నారు. ఉత్తమ్ కుమార్, భట్టి ,శ్రీధర్ బాబు , రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి తదితరులు ఢిల్లీ లోనే మకాం వేశారు. రేవంత్ వైపే అధిష్టానం మొగ్గుచూపుతున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ జీవన్ రెడ్డి కి టీపీసీసీ భాద్యతలు ఇస్తే ప్రచార కమిటీ చైర్మన్ గా రేవంత్ నియామకం దాదాపు ఖాయమే అవుతుందని తెలుస్తుంది. అయితే ఇద్దరు రెడ్డి సామాజికవర్గనేతలే అయినందున మధుయాష్కీ పేరు కూడా గట్టిగానే వినపడుతుంది. శ్రీధర్ బాబు ,మర్రి శశిధర్ రెడ్డి లాంటివారిపేరులు కూడా తెరపైకి వచ్చే అవకాశం కొట్టిపారేయలేమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. చూద్దాం ఏమిజరుగుతుందో !

Related posts

కేసీఆర్ తర్వాత నేనే.. ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు!

Drukpadam

పవన్ బీజేపీ వైపు రాకుండా బీజేపీ అడ్డుకుంటుంది…టీడీపీ నేత పితాని …

Drukpadam

సోనియా, రాహుల్‌తో విభేదాలేం లేవు.. పార్టీ వీడటంపై సుస్మితా దేవ్!

Drukpadam

Leave a Comment