Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

పెండింగ్ లో ఉన్న ఐదు డీఏ లు ఇవ్వండి …తెలంగాణ ఉద్యోగ సంఘాల డిమాండ్ ..

గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న డీఏ లు ఇవ్వాలని హైద్రాబాద్ లో జరిగిన తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ సమావేశం డీమాండ్ చేసింది …ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలు పరిస్కారం అవుతాయని భావించినప్పటికీ ఇంతవరకు సానుకూల చర్యలు తీసుకోకపోవడంపట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమావేశం అభిప్రాయపడింది …కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పడూ డీఏ లు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగులు ఆందోళనలతో ఉన్నారని సమావేశం తెలిపింది …పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకు ఇవ్వాల్సిన డీఏ లు ఇవ్వకపోవడం అనేక సార్లు ప్రభుత్వ దృష్టికి తెచ్చిన పట్టించుకోకపోవడంపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది ..

పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించేలా చూడాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి కోరారు. 26న జరిగే కేబినేట్ సమావేశంలో డీఏలు చెల్లించేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. జీఓ నం.317తో రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులందరికీ సత్వరమే న్యాయం చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నగదు రహిత వైద్య సేవలు అందే విధంగా నూతన హెల్త్ స్కీంను అమలు చేయాలన్నారు. ఉద్యోగుల జేఏసీ కమిటీ సమావేశం నాంపల్లిలోని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన ఐదు డీఏ బకాయిలు, జీఓ నం.317పై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక, నూతన హెల్త్ స్కీం అమలు, సీపీఎస్ రద్దు అంశాలపై చర్చించారు.

Related posts

మణిపూర్ నిందితులను కఠినంగా శిక్షించాలి…సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

Ram Narayana

బీజేపీలో లుకలుకలు …ఈటెల ,రాజగోపాల్ రెడ్డిలు పార్టీ కార్యక్రమాలు దూరం …దూరం …

Drukpadam

వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్ ఘనత కాంగ్రెస్ దే: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…

Drukpadam

Leave a Comment