Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

ఛత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృతి.. !

  • అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు
  • ఊపిరి ఆడక కారులోనే ఆరుగురు దుర్మరణం
  • మృతుల్లో ఓ మహిళ, మరో చిన్నారి ఉందన్న పోలీసులు

ఛత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది చనిపోయారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున బలరామ్ పూర్ లో ఈ ప్రమాదం జరిగింది. లరిమా నుంచి సూర్జాపూర్ వెళుతున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులో పడిపోయింది.

స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. కారులో డ్రైవర్ సహా ఎనిమిది మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. కారు నీట మునగడంతో ఊపిరి ఆడక ఆరుగురు కారులోనే చనిపోయారని చెప్పారు. మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస వదిలారని వివరించారు. మరణించిన వారిలో ఓ మహిళ, మరో చిన్నారి ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

Related posts

చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Ram Narayana

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్యుల దుర్మరణం!

Ram Narayana

కువైట్ లో ఘోర అగ్నిప్రమాదం… 40 మంది భారతీయుల సజీవ దహనం…

Ram Narayana

Leave a Comment