Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ప్రమాదాలు ...

తూర్పు గోదావరి జిల్లాలో విద్యుత్ షాక్‌తో న‌లుగురి మృతి!

  • ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లాలో ఘ‌ట‌న
  • ఫ్లెక్సీలు క‌డుతున్న స‌మ‌యంలో విద్యుత్ షాక్‌కు గురైన యువ‌కులు
  • తాడిప‌ర్రు గ్రామానికి చెందిన కృష్ణ‌, నాగేంద్ర‌, మ‌ణికంఠ‌, వీర్రాజు మృతి
  • ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న ఉండ్రాజ‌వ‌రం పోలీసులు  

ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని ఉండ్రాజ‌వ‌రం మండ‌లం తాడిప‌ర్రు గ్రామంలో పాప‌న్న గౌడ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం కోసం ఫ్లెక్సీలు క‌డుతున్న స‌మ‌యంలో ఈ విషాద‌ ఘ‌ట‌న జ‌రిగింది.

ఫ్లెక్సీలు క‌డుతున్న స‌మ‌యంలో పైన ఉన్న‌ హైటెన్ష‌న్ వైర్లు త‌గిలి గ్రామానికి చెందిన న‌లుగురు యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. కృష్ణ‌, నాగేంద్ర‌, మ‌ణికంఠ‌, వీర్రాజు మృతిచెంద‌గా.. మ‌రొక‌రి ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. 

ఇక స్థానికుల స‌మాచారంతో ఘ‌టనాస్థ‌లికి చేరుకున్న ఉండ్రాజ‌వ‌రం పోలీసులు మృత‌దేహాల‌ను పోస్టుమార్టం కోసం స్థానిక ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Related posts

త్వరలోనే భారత్‌కు ‘టెస్లా’ కార్లు.. ధర ఇంత ఉండొచ్చట!

Drukpadam

పవన్ కల్యాణ్ అనే నేను అనగానే చప్పట్లు, కేకలతోో మార్మోగిన సభా ప్రాంగణం…

Ram Narayana

ప్రతిభకు మార్కులే కొలమానం కాదు..ఓబీసీ కోటా యథాతథమంటూ సుప్రీం!

Drukpadam

Leave a Comment