Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సుప్రీం కోర్ట్ వార్తలు

కోర్టు తీర్పులను విమర్శించే హక్కు మీడియాకుంది : సుప్రీంకోర్టు

కోర్టులు ఇచ్చే తీర్పులను నిష్పక్షపాతంగా విమర్శించే హక్కు మీడియాకు ఉందని సుప్రీంకోర్టు
స్పష్టం చేసింది…వాటిని ఆహ్వానించాలని అవి సహేతుకంగా ఉండాలని పేర్కొన్నది …
రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కైన భావప్రకటనా స్వేచ్ఛలో ఇది భాగమేననితెలిపింది.
తీర్పులను సహేతుకంగా విమర్శించటంనేరం కాదని, అదొక హక్కని పేర్కొంది.
న్యాయమూర్తులతో సహా ఎవరూ లోపరహితులు కాదని… సద్విమర్శలను ప్రోత్సహించాలని తెలిపింది. అప్పట్లో కేంద్రమానవవనరుల మంత్రి కపిల్ సిబాల్ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా, ఆ పత్రికా విలేకరిలపై దాఖలైన కోర్టు ఉల్లంఘన కేసుపై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. 1995లో న్యాయవాదిగా ఉన్న సిబాల్..
న్యాయవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై టైమ్స్ఆఫ్ండియాలో ఒకవ్యాసం రాశారు.
దానిపై కోర్టు ఉల్లంఘన కేసు నమోదైంది. ఆయన తనకున్న అభిప్రాయాలను వెల్లడించారని అందువల్ల దాన్ని తప్పుపట్టలేమని తన తీర్పులో స్పష్టం చేసింది …

రాజకీయనాయకులు , సంఘ వ్యతిరేక శక్తులు , మాఫియా , రియాల్టర్స్ ,మీడియాను తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని కోరుకుంటున్న సందర్భంలో మీడియా స్వేచ్ఛపై సుప్రీం తీర్పు మంచి సందేశాన్ని ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..అయితే మీడియా స్వేచ్ఛ అనేది నేడు మీడియా యజమానులు చేతుల్లో ఉండి పాలకులకు బాకాలు గా తయారయ్యాయని విమర్శలు ఉన్నాయి…

Related posts

బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్‌కు సుప్రీం సూచన…

Ram Narayana

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా!

Ram Narayana

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా కపిల్ సిబల్ ఘనవిజయం …

Ram Narayana

Leave a Comment