Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వాజేడు ఎస్సై ఆత్మహత్య వెనక యువతి.. దర్యాప్తుల్లో వెలుగులోకి విస్తుపోయే విషయాలు!

  • సోమవారం సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్న ఎస్సై హరీశ్
  • ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి
  • ప్రేమిస్తున్న యువతి గతం తెలిసి దూరం పెట్టే ప్రయత్నం
  • పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోబోతున్నట్టు చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం
  • వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని బెదిరించడంతో ఎస్సై ఆత్మహత్య!

ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్య వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఓ యువతి (26)తో ప్రేమాయణమే ఆయన బలవన్మరణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె గతం తెలిసి దూరం పెట్టాలనుకోవడం, దీంతో ఆమె ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని బెదిరించడంతో మనస్తాపం చెంది సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నట్టు తెలిసింది.

ఏడు నెలల క్రితం హరీశ్‌కు ఓ యువతి నుంచి ఫోన్ వచ్చింది. ఏవో విషయాలు ఆరా తీస్తూ ఆయనతో మాటలు కలిపింది. ఆపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ చాట్ చేసుకునేవారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆమె హైదరాబాద్‌లో చదువుకుంటోంది. సెలవు రోజుల్లో వాజేడు వచ్చి రెండ్రోజులు ఉండి వెళ్లేది. వారి మధ్య ప్రేమ మరింత ముదిరి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

ఈ క్రమంలో ఆమె గురించి ఎస్సై ఆరా తీస్తే.. ఆమె ఊర్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేదని, వారిలో ఒకరు పెళ్లికి నిరాకరించడంతో చిలుకూరు పోలీస్ స్టేషన్‌లో ఆమె కేసు కూడా పెట్టినట్టు తెలిసింది. అప్పటి నుంచి హరీశ్ ఆమెను దూరం పెట్టడంతోపాటు పెళ్లి ప్రతిపాదనను నిరాకరించి పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోవాలన్నాడు. అదే విషయాన్ని ఆమెకు చెప్పడంతో ఆదివారం యువతి వాజేడు వచ్చింది. 

అక్కడ ఇద్దరి మధ్య ఈ విషయమై వాగ్వివాదం జరిగింది. ఆమెతో సెటిల్ చేసుకునేందుకు ఎస్సై ప్రయత్నించినా నిరాకరించింది. అంతేకాకుండా విషయాన్ని ఉన్నతాధికారులకు చెబుతానని బెదిరించడంతో హరీశ్ సోమవారం సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హరీశ్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.

Related posts

ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య.. ఆకలితో ఐదురోజులు అల్లాడి మరణించిన 9 నెలల చిన్నారి!

Drukpadam

దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి.. యశోద ఆసుపత్రికి తరలింపు…

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ‘రాధాకిషన్‌రావు బ్యాచ్’ దారుణం మరోటి వెలుగులోకి..!

Ram Narayana

Leave a Comment