Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సోనియా వ్యాక్సిన్ తీసుకున్నారు… రాహుల్ కు మరికొంత సమయం పడుతుంది: కాంగ్రెస్…

సోనియా వ్యాక్సిన్ తీసుకున్నారు… రాహుల్ కు మరికొంత సమయం పడుతుంది: కాంగ్రెస్
దేశంలో వ్యాక్సినేషన్ పై రాహుల్ విమర్శలు
రాహుల్ వ్యాక్సిన్ వేయించుకుని ఆపై మాట్లాడాలన్న బీజేపీ
స్పందించిన కాంగ్రెస్ పార్టీ
గతంలో రాహుల్ కరోనా బారినపడ్డారని వెల్లడి

దేశంలో వ్యాక్సినేషన్ పై విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ మొదట తాను వ్యాక్సిన్ తీసుకుని ఆపై మాట్లాడాలని బీజేపీ విమర్శిస్తుండడం పట్ల కాంగ్రెస్ బదులిచ్చింది. రాహుల్ గాంధీకి గతంలో కరోనా సోకినందున ఆయన వ్యాక్సిన్ తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్నవారు వ్యాక్సిన్ తీసుకోవడానికి కొంత విరామం అవసరం అని కేంద్ర మార్గదర్శకాలే చెబుతున్నాయని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ ఏప్రిల్ లోనే టీకా తీసుకోవాలని నిర్ణయించుకున్నారని, అయితే కరోనా పాజిటివ్ రావడంతో విరమించుకున్నారని తెలిపారు. ఇక, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రెండు డోసులు తీసుకున్నారని, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తొలి డోసు వేయించుకున్నారని సూర్జేవాలా వివరించారు.

Related posts

పవన్ వ్యాఖ్యలు కొత్తగా ఉన్నాయి..ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు!

Drukpadam

వనమా రాఘవ మెడకు బిగుస్తున్న ఉచ్చు …పాతకేసులు తిరగదోడుతున్న వైనం!

Drukpadam

కేసీఆర్ బీఆర్ యస్ పెట్టడంలో కుట్రకోణం దాగిఉంది…పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Drukpadam

Leave a Comment