మళ్ళీ రాజ్యసభకు ఆర్ .కృష్ణయ్య…ఈసారి బీజేపీ అభ్యర్థిగా…!
ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యను ప్రకటించిన బీజేపీ
ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలు
పార్టీలో చేరిన ఆర్.కృష్ణయ్యకు సముచిత గౌరవం ఇచ్చిన బీజేపీ
ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేసిన కృష్ణయ్య
కొందరు ప్రజాసమస్యలపై పోరాడటంకన్నా తమ పదవులపై జ్యాస తప్ప మరొకటి ఉండదు …పార్టీ ఏదైనా పదవే ముఖ్యం … అందుకు ఎంతకైనా దిగజారతారు…ఇదేమంటే బడుగు బలహీన వారాగాలకోసమే తాము పార్టీ మారమని …తమకు ప్రజాసమస్యలు ముఖ్యమని వాటి పరిస్కారం కోసం తాము పార్టీలు మారాల్సి వచ్చిందని సమర్ధించుకుంటారు …కొందరు ఏ పార్టీ అధికారంలో ఉంటె ఆ పార్టీలో చేరి తమ పనులు చక్కబెట్టుకుంటారు …మరి జాతీయ బీసీ సంఘం నేత ఆర్ .కృష్ణయ్య ఈ కోవలోకి వస్తారా ..? రారా అనేది చూడాలి …ఏది ఏమైనా పార్టీలు మారడం భుజం మొడ్డ కండువా మార్చినంత తేలిగ్గా మార్చుతుండటం జుగుస్సాకరం ..
, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు వైసీపీని వీడి బీజేపీకి దగ్గరయ్యారు …ఈరోజు ప్రకటించిన బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో ఆర్ .కృష్ణయ్య పేరు రావడం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది ..బీజేపీ ఆయనకు సముచిత గౌరవాన్ని ఇచ్చింది. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కృష్ణయ్యను బీజేపీపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది . గతంలో ఆయన వైసీపీ తరపున రాజ్యసభకు వెళ్లారు. ఎన్నికల తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి ఆయన రాజీనామా చేశారు. మరోవైపు హర్యానా నుంచి రేఖాశర్మను, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ ను రాజ్యసభ అభ్యర్థులుగా బీజేపీ నాయకత్వం ఎంపిక చేసింది.
వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు ఆర్ కృష్ణయ్యతో పాటు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు కూడా రాజీనామా చేయడం తెలిసిందే. మోపిదేవి, బీద మస్తాన్ రావు టీడీపీలో చేరారు. ఏపీ నుంచి ఖాళీ అయినా మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీ ,ఒకటి బీజేపీ పోటీచేస్తుంది …ఈ మేరకు ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలమధ్య అంగీకారం కుదిరింది ..