Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కారును దగ్ధం చేసిన మావోయిస్టులు! ఏజన్సీ ఏరియాలో కలకలం

maoists set fire to vehicle in alluri sitarama raju district tension in chinturu agency
  • చింతూరు నుండి భద్రాచలం వైపు వెళ్లే జాతీయ రహదారిలో కారును దగ్ధం చేసిన మవోయిస్టులు
  • మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఘటన
  • ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్న పోలీసులు

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీ ఏరియాలో జాతీయ రహదారిపై సరివెల వద్ద మావోయిస్టులు ఓ కారును దగ్ధం చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది. చింతూరు వైపు నుండి భద్రాచలం వెళ్లే రహదారి మధ్యలో సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

ఈ నెల 2 నుంచి 8 వరకూ మావోయిస్టుల వారోత్సవాలు జరిగాయి. వారోత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే దగ్ధమైన కారు ఎటు నుంచి బయలుదేరింది? ఎంత మంది వ్యక్తులు అందులో ప్రయాణించారు? అనే సమాచారం తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఏజన్సీ ఏరియాలో ఆందోళన రేకెత్తిస్తోంది.  

Related posts

ఆటోలోంచి కిందపడిన రూ. 500 నోట్లు.. పట్టనట్టు వెళ్లిపోయిన వైనం!

Drukpadam

అమెరికాలో కాల్పుల మోత.. ఇంటి యజమాని సహా నలుగురి మృతి.. కాల్చింది కొడుకే!

Ram Narayana

గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు షాక్… పీడీ యాక్ట్ ను సమర్థించిన అడ్వైజరీ కమిటీ!

Drukpadam

Leave a Comment