Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం: భట్టివిక్రమార్క స్పష్టీకరణ…

  • ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారమవుతున్నాయని వెల్లడి
  • ప్రజలకు జవాబుదారిగా ఉండాలనేది తమ లక్ష్యమన్న భట్టివిక్రమార్క
  • ప్రజల కోసమే ఉన్నామనే భావన అధికారులు కల్పించాలని సూచన

ప్రజావాణిపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారమవుతున్నట్లు తెలిపారు. ప్రతి పౌరుడికి నమ్మకం కలిగేలా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నామన్నారు.

ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రజలకు జవాబుదారిగా ఉండాలనేది, ప్రజల అవసరాలు తీర్చాలనేది తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ప్రజల కోసమే ఉన్నామనే భావనను వారిలో అధికారులు కల్పించాలని సూచించారు. రాజ్యాంగ పీఠికలోని లక్ష్యాలను ప్రజలకు అందించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. 

Related posts

ఎమ్మెల్సీ చుట్టూ బిగుస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు!

Ram Narayana

హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు… సీఎస్ సహా పలువురికి నోటీసులు!

Ram Narayana

తెలంగాణ ఎన్నికల్లో డాక్టర్ల హవా

Ram Narayana

Leave a Comment