Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో అప్పులపై బీఆర్ యస్ ది తప్పుడు ప్రచారం ..డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

రాష్ట్ర ఆర్థిక, అప్పుల పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఫైర్ అయ్యారు. ఆదివారం ఖమ్మం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ యస్ అధికారంలో ఉండగా చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి తాము అప్పులు చేశాము తప్ప వేరే కాదని బీఆర్ యస్ నేతలు తెలుసుకోవాలని అన్నారు ..నిత్యం కేటీఆర్ , హరీష్ రావు లు ఎదో జరిగిపోతుందని వర్లడం మానుకోవాలని హితవు పలికారు …రాష్ట్రాన్ని అప్పలపాలుచేసి మేము చేస్తున్నట్లు గోబెల్స్ ప్రచారం చేయడం వారికే చెల్లిందని భట్టిగ బీఆర్ యస్ నేతల చర్యలపై ఘాటుగా స్పందించారు …

గత 10 సంవత్సరాల కాలంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7,11,911 కోట్ల రూపాయల అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. నేడు తాము అప్పులు చేసినట్లుగా ఆ పార్టీ ప్రచారం చేయడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ తినడానికి అప్పులు చేస్తే.. వారు చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసిందని క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.54, 118 కోట్లు అప్పులు చేయగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకు మొత్తం 66,782 కోట్ల రూపాయలు బ్యాంకులకు కట్టామన్నారు.‌ అసెంబ్లీ లో ఎవరు ఎన్ని అప్పులు చేశారో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన  2014 నాటికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు 72,658 కోట్లు రూపాయలు ఉండగా, 2024 నాటికి 3,89,673 కోట్ల రూపాయలు గత బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిందని వివరించారు. కార్పొరేషన్ల పేరిట ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి తీసుకున్న అప్పులు 2014 నాటికి 5,893 కోట్ల రూపాయలు ఉండగా, 2024 నాటికి 95,462 కోట్లు, ప్రభుత్వ గ్యారెంటీ లేకుండా వివిధ కార్పొరేషన్లు నేరుగా చేసిన అప్పులు 2014 నాటికి ఏమీ లేకపోగా, 2024 నాటికి 59,414 కోట్లు రూపాయలు అప్పు గత పాలకులు చేశారన్నారు. ఇవే కాకుండా గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పాలకులు ఇరిగేషన్, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, హాస్పిటల్, ఉద్యోగుల జిపిఎఫ్, మిడ్ డే మీల్స్, ఫీజు రియంబర్స్మెంట్ తదితర వాటికి అప్పుగా పెట్టినవి 40,154 కోట్ల రూపాయలు ఉన్నాయని, వీటన్నిటిని కలిపితే మొత్తం రూ.7,11,911 కోట్ల అప్పుల భారాన్ని గత బిఆర్ఎస్ పాలకులు ప్రజలపై మోపి తగుదునమ్మ అంటూ కేటీఆర్, హరీష్ రావులు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రాష్ట్ర అప్పుల గురించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు బ్యాంకులకు 2014 నాటికి సంవత్సరానికి రూ.6400 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించగా, గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్ల అప్పులు మరియు వడ్డీలు కట్టడానికి 66,782 కోట్ల రూపాయలు చెల్లించే దుస్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లి గాయి, గాయిగా అరవడం దేనికని నిలదీశారు. టిఆర్ఎస్ నాయకులకు గాలి మాటలు చెప్పడం, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు బ్రమలు కల్పించి ప్రజలను మోసం చేయడం బాగా తెలుసని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత బిఆర్ఎస్ పాలకులు చేసిన ఆర్థిక విధ్వంసం అప్పుల గురించి శ్వేత పత్రం అసెంబ్లీలో విడుదల చేసి ప్రజలకు వాస్తవాలు చెప్పామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీలను అమలు చేస్తున్నదని వివరించారు. భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రెండు విడతల్లో 12 వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాన్ని ఈనెల 28న అమలు చేయబోతున్నామన్నారు. దేశ స్వాతంత్రం కోసం ఏర్పడిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు డిసెంబర్ 28న రాష్ట్రంలోని నిరుపేద కూలీల కుటుంబాలకు మొదటి విడతగా 6 వేల రూపాయలను ప్రజా ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రకటించారు. అదేవిధంగా రైతు భరోసా చెల్లించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా వచ్చే సంక్రాంతి నుంచి రైతులకు రైతుబంధు డబ్బులు ఇస్తామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రెండు లక్షల రుణాలు ఉన్న రైతులందరికీ కేవలం 15 రోజుల్లోనే వారి ఖాతాల్లో నేరుగా 21 వేల కోట్ల రూపాయలను జమ చేసి దేశానికి ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచిందన్నారు.

రైతుల కోసం ప్రజా ప్రభుత్వం 50,953 కోట్లు ఖర్చు చేసింది

ప్రజా ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయానికి, రైతుల కోసం నేరుగా 50,953 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వివరించారు.‌ రైతు భరోసా కు 7625 కోట్లు, రైతు రుణమాఫీకి 21 వేల కోట్ల రూపాయలు, రైతు బీమా ప్రీమియం చెల్లింపుకు 1514 కోట్ల రూపాయలు, ఫర్ డ్రాప్ మోర్ క్రాప్ కొరకు 40 కోట్ల రూపాయలు రైతులకు విత్తనాల సరఫరా నిమిత్తం 36 కోట్ల రూపాయలు, వ్యవసాయ పంపుసెట్లకు ఇస్తున్న సబ్సిడీకి 11,270 కోట్ల రూపాయలు, వ్యవసాయానికి కావలసిన సాగునీరు (ఇరిగేషన్) పనుల కోసం 9,795 కోట్లు, మొత్తం 50, 953 కోట్ల రూపాయలను ఖర్చు చేసి నిబద్ధత చాటుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని పేర్కొన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని పూర్తిగా విస్మరించగా ప్రజా ప్రభుత్వం ఎకరాకు పదివేల రూపాయలు చెల్లించిందని వెల్లడించారు.‌బిఆర్ఎస్ కట్టామని చెప్పుకుంటున్న కాలేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మాణం చేసిన ప్రాజెక్టుల నుంచి పారిన నీళ్లతో పండిన ప్రతి గింజను ప్రజా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.‌ కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను వారం రోజుల్లో రైతులకు చెల్లిస్తున్నామని చెప్పారు.‌ సన్న ఓట్లకు క్వింటాకు 500 బోనస్ చెల్లిస్తున్నామని తెలిపారు. సన్న వడ్లపై క్వింటాకు ఇస్తున్న 500 బోనస్ ద్వారా ప్రతి ఎకరాకు పది నుంచి పదిహేను వేల రూపాయలను అదనంగా రైతులు లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు.‌ 1.20 లక్షల కోట్ల రూపాయలతో గొప్పగా, అద్భుతంగా కాలేశ్వరం కట్టామని బిఆర్ఎస్ నాయకులు చెప్పారని, కానీ కాలేశ్వరం తో సంబంధం లేకుండా ఈ ఏడాది వారి ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు.

రాష్ట్రంలో నాలుగు కొత్త విమానాశ్రయాలు

రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల విస్తరణ కోసం ప్రజా ప్రభుత్వం కొత్తగూడెం రామగుండం ఆదిలాబాద్ వరంగల్ ప్రాంతాల్లో విమానాశ్రయాలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి ద్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఫ్యూచర్ సిటీని నిర్మాణం చేస్తున్నామన్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం గుండా 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మోసిని ప్రక్షాళన చేసి పునర్జీవం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని వెల్లడించారు. అన్ని జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ మధ్యన ఇండస్ట్రియల్, హౌసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసి భవిష్యత్తు తరాలకు అందిస్తామన్నారు.

Deputy CM Bhatti Vikramarka Mallu was on fire saying that BRS, which is in the opposition, is spreading false propaganda to mislead the people about the financial and debt situation of the state. He spoke at a media conference organized at Khammam Congress Party district office on Sunday. He said BRS leaders should know that they have borrowed nothing but to pay interest on the loans made while BRS was in power..Nityam KTR and Harish Rao said that they should refrain from ruling that something will happen.. Reacted strongly…

He said that they have accurate calculations regarding the debts of 7,11,911 crore rupees incurred by the previous BRS government directly and indirectly during the last 10 years. He said that it is not appropriate for the party to campaign as if they had incurred debts today. He clarified that if the BRS government took loans to eat, the Congress government took loans to pay interest on their loans. He said that since his government came to power, he has incurred debts of Rs.54,118 crores, while the previous BRS government has paid a total of Rs.66,782 crores to the banks for the debts and interests. It was explained that by 2014 when the state of Telangana was formed, the state government directly borrowed 72,658 crore rupees, and by 2024, the previous BRS government had borrowed 3,89,673 crore rupees. The loans taken by the government on behalf of the corporations were 5,893 crore rupees by 2014, and 95,462 crore by 2024, while the loans made directly by various corporations without government guarantee were nothing as of 2014, and 59,414 crore rupees by 2024, the previous rulers said. Apart from this, the BRS rulers who were in power for the last 10 years have lent Rs 40,154 crore for irrigation, R&B, Panchayat Raj, hospital, employee GPF, mid-day meals, fee reimbursement, etc. KTR and Harish Rao say that the rulers have blamed the people He said that they are telling blatant lies about the state’s debts to mislead people. As of 2014, only Rs.6400 crores were paid to the banks for the debts incurred by the state government, but in the last 10 years, the debts incurred by the BRS have taken the state to the predicament of paying Rs.66,782 crores to pay off the debts and interest. He criticized the TRS leaders for being very good at talking nonsense and deceiving the people by creating falsehoods as if there is something that does not exist. On this occasion, he reminded that when the public government came to power, a white paper was released in the assembly about the economic destruction debts committed by the previous BRS rulers and told the people the facts. He explained that despite the state’s financial situation not being good, the Congress government is implementing the guarantees as per the promises made to the people in the elections. He said that the promise made by the Congress party before the elections to provide financial assistance of 12 thousand rupees in two installments to the landless poor families every year is going to be implemented on 28th of this month. On December 28, the day of the birth of the All India Congress Party, which was formed for the independence of the country, it was announced that the public government would pay 6 thousand rupees as the first installment to the families of poor laborers in the state. Similarly, as announced by the Chief Minister Revanth Reddy that the government is committed to pay Rythu Bharosa, they will give Rythu Bandhu money to the farmers from next Sankranti. He said that the Telangana government has set an example for the country by directly depositing 21 thousand crore rupees in their accounts in just 15 days, unlike any other state in the country.

50,953 crores has been spent by the public government for the farmers

It was explained that since the people’s government came to power till now, 50,953 crore rupees have been directly spent on agriculture and farmers. 36 crore for supply of seeds and Rs.11,270 for subsidy on agricultural pump sets. crores of rupees, 9,795 crores for irrigation works for agriculture, out of a total expenditure of He said that it was the Congress government that had spent 50,953 crore rupees and made a commitment. Similarly, it was revealed that the public government paid ten thousand rupees per acre while the previous government completely ignored the crop damage compensation. Regardless of the Kaleshwaram project which BRS claims to have been built, the public government will buy every grain grown with runoff water from the projects constructed by the previous Congress governments. He said that they are paying 500 bonus per quinta for small votes. It was revealed that the farmers are getting additional benefit of 10 to 15 thousand rupees per acre through the 500 bonus given to the quinta on small paddy. BRS leaders said that Kaleswaram was built in a great and wonderful way with 1.20 lakh crore rupees, but this year their production has increased significantly regardless of Kaleswaram.

Four new airports in the state

For the expansion of industries across the state, the public government will set up airports in Kothagudem, Ramagundam, Adilabad, Warangal areas. He said that the Congress government is working for the development of the state and as a part of that, a future city is being constructed in Hyderabad city and a sports university and skill university with international standards are being established. It has been revealed that the Congress government is making an effort to clean and revive the Mosi, which is flowing for 55 kilometers through the state capital Hyderabad city. A regional ring road will be established connecting all the districts. Industrial and housing clusters will be established between the outer ring road and the regional ring road and will be provided to the future generations.

Related posts

రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నోటీసు… ఆ 16 లక్షలు తిరిగివ్వాలని ఓ రైతుకు ఆదేశాలు!

Ram Narayana

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త

Ram Narayana

టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి

Ram Narayana

Leave a Comment